ఆర్ధిక మాంద్యం దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా( America ) వణుకుతోంది.ఆ దేశానికి చెందిన దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే.
రానున్న రోజుల్లో ఈ పరిస్ధితి మరింత తీవ్రంగా వుండే అవకాశం వుందని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న విదేశీ కార్మికుల్లో భారతీయులు కూడా వున్నారు.
గూగుల్ , మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలలో లే ఆఫ్‌ల( Lay Off ) కారణంగా భారతీయులు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోతున్నారు.
అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఐటీ నిపుణుల్లో 30 నుంచి 40 శాతం మంది భారతీయులేనని నివేదికలు చెబుతున్నాయి.
వీరిలో చాలా మంది హెచ్ 1బీ, ఎల్ 1 వీసాలపై వున్నవారేనని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.మరోవైపు.ఉద్యోగం పోయిందన్న బాధ కంటే హెచ్1బీపై( H-1B ) వున్న వారికి 60 రోజుల నిబంధన కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.హెచ్ 1 బీ వీసాతో అమెరికాలో వుంటున్న విదేశీ ఉద్యోగులు . తమ ఉద్యోగం కోల్పోయిన 60 రోజుల్లోగా మరో ఉద్యోగంలో చేరాల్సి వుంటుంది.లేనిపక్షంలో అట్టివారు అమెరికాలో ఉండటానికి అనర్హులు.
ఈ నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన వారు తీవ్ర ఆందోళనలో వున్నారు.

అమెరికాలో ఉద్యోగాలు దొరకడమే కష్టంగా వున్న తరుణంలో .60 రోజులలోపు దేశం విడిచి వెళ్లడం తప్పించి వేరే మార్గం లేదని భావిస్తున్న వారికి యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్)( USCIS ) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.దీని ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బాధితులు 60 రోజుల గ్రేస్ పీరియడ్‌కు మించి అమెరికాలో వుండవచ్చు.
యూఎస్‌సీఐఎస్ మార్గదర్శకాలు :

1.నాన్ ఇమ్మిగ్రెంట్ స్టేటస్‌ను( Non Immigrant Status ) మార్చాలని కోరుతూ దరఖాస్తు దాఖలు చేయడం2.స్టేటస్ సర్దుబాటు కోరుతూ దరఖాస్తు దాఖలు చేయడం3.బలవంతపు పరిస్ధితుల ఎంప్లాయ్‌మెంట్ అథరైజేషన్ డాక్యుమెంట్( Employment Authorization Document ) కోసం దరఖాస్తు చేయడం.లేదా4.యజమానిని మార్చడానికి ‘‘ nonfrivolous petition ’’ లబ్ధిదారుగా వుండటం
60 రోజుల గ్రేస్ పీరియడ్ లోపు పైన పేర్కొన్న చర్యలలో ఏదో ఒకదానిని ఆశ్రయించడం ద్వారా వారు మునుపటి వలసేతర స్థితిని కోల్పోయినప్పటికీ అమెరికాలో వుండే గడువు కాలాన్ని పెంచుకోవచ్చు.దీనికి అదనంగా అర్హత వున్న హెచ్ 1 బీ వలసదారులు కొత్త హెచ్1బీ పిటిషన్ దాఖలు చేసిన వెంటనే కొత్త యజమాని తరపున పనిచేయడం ప్రారంభించవచ్చు.180 రోజుల పెండింగ్ స్టేటస్ తర్వాత స్టేటస్ అప్లికేసన్ సర్దుబాటు.న్యూ ఆఫ్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్‌కు బదిలీ చేయబడుతుంది.