మహానటి సినిమాలో ఆ సీన్ అంటే దుల్కర్ కి అంత ఇష్టమా.. ఇన్నాళ్లకు బయట పెట్టారుగా?

డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్( Keerthy Suresh ) దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) హీరో హీరోయిన్లుగా సావిత్రి గారి బయోపిక్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.మహానటి( Mahanati ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ చిత్రం ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.

 Dulquer Salmaan Likes That Scene In Mahanati Movie Details, Mahanati Movie, Dulq-TeluguStop.com

ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో దుల్కర్ సల్మాన్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ జెమినీ గణేషన్ పాత్రలో( Gemini Ganesan Role ) ఎంతో అద్భుతంగా నటించారు.ఇక ఈ సినిమాలో తనుకు నచ్చిన సన్నివేశం గురించి ఈయన ఈ సందర్భంగా మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సినిమాలో తనకు ఎంతో ఇష్టమైనటువంటి సీన్ గురించి మాట్లాడుతూ.

సావిత్రి పాత్రలో నటిస్తున్నటువంటి కీర్తి సురేష్ కు ఇదివరకే జెమినీ గణేషన్ కి పెళ్లి జరిగింది అనే విషయాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది.

ఇలా ఆమె బాధ పడుతూ ఉన్నప్పటికీ వారిద్దరు కలిసిన నటిస్తున్నటువంటి ఓ సినిమా షూటింగ్లో భాగంగా చాముండేశ్వరి ఆలయం వద్దకు వెళ్తారు అక్కడ జెమినీ గణేషన్ చెప్పినటువంటి మాటలు విన్న సావిత్రి(కీర్తి సురేష్) ఆయన్ని పెళ్లి చేసుకుంటుంది.ఈ సీన్ ఈ సినిమా విడుదలైనప్పుడు ఎంతోమంది ప్రేక్షకుల మదిని కూడా దోచింది.అయితే ఇప్పుడు ఇదే సీన్ తనకు ఎంతో ఫేవరెట్ సీన్ అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ సినిమా తర్వాత తెలుగులో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న దుల్కర్ అనంతరం సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సస్ అందుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube