మహానటి సినిమాలో ఆ సీన్ అంటే దుల్కర్ కి అంత ఇష్టమా.. ఇన్నాళ్లకు బయట పెట్టారుగా?

డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్( Keerthy Suresh ) దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) హీరో హీరోయిన్లుగా సావిత్రి గారి బయోపిక్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

మహానటి( Mahanati ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ చిత్రం ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో దుల్కర్ సల్మాన్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

"""/" / ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ జెమినీ గణేషన్ పాత్రలో( Gemini Ganesan Role ) ఎంతో అద్భుతంగా నటించారు.

ఇక ఈ సినిమాలో తనుకు నచ్చిన సన్నివేశం గురించి ఈయన ఈ సందర్భంగా మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాలో తనకు ఎంతో ఇష్టమైనటువంటి సీన్ గురించి మాట్లాడుతూ.సావిత్రి పాత్రలో నటిస్తున్నటువంటి కీర్తి సురేష్ కు ఇదివరకే జెమినీ గణేషన్ కి పెళ్లి జరిగింది అనే విషయాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది.

"""/" / ఇలా ఆమె బాధ పడుతూ ఉన్నప్పటికీ వారిద్దరు కలిసిన నటిస్తున్నటువంటి ఓ సినిమా షూటింగ్లో భాగంగా చాముండేశ్వరి ఆలయం వద్దకు వెళ్తారు అక్కడ జెమినీ గణేషన్ చెప్పినటువంటి మాటలు విన్న సావిత్రి(కీర్తి సురేష్) ఆయన్ని పెళ్లి చేసుకుంటుంది.

ఈ సీన్ ఈ సినిమా విడుదలైనప్పుడు ఎంతోమంది ప్రేక్షకుల మదిని కూడా దోచింది.

అయితే ఇప్పుడు ఇదే సీన్ తనకు ఎంతో ఫేవరెట్ సీన్ అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ సినిమా తర్వాత తెలుగులో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న దుల్కర్ అనంతరం సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సస్ అందుకున్నారు.

మనసంతా నువ్వే దర్శకుడిని ఆ సంస్థ నిజంగానే తొక్కేస్తుందా?