ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి స్నేహ( Sneha ) ఒకరు ఏ విధమైనటువంటి గ్లామర్ షో లేకుండా స్టార్ హీరోయిన్గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి వారిలో స్నేహ ఒకరిని చెప్పాలి.ఇలా స్నేహ నటించిన సినిమాలలో చాలా పద్ధతిగా కనిపిస్తూనే ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు.

 Actress Sneha Comments About Her Dresses Details, Sneha,prasanna,dresses,star Ac-TeluguStop.com

సౌందర్య తర్వాత అదే స్థాయిలో ఈమె గుర్తింపు పొందినప్పటికీ అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు.

అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఈమె పలు సినిమాలలో హీరో లేదా హీరోయిన్లకు అక్క వదిన పాత్రలలో నటిస్తున్నారు.అలాగే బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇక స్నేహ తన భర్తతో కలిసి పలు బ్రాండ్ లను ప్రమోట్ చేస్తూ భారీ స్థాయిలోనే సంపాదిస్తున్నారని చెప్పాలి.

ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె తమిళ నటుడు ప్రసన్న( Prasanna ) అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.వీరిద్దరికీ ఇద్దరు సంతానం అనే సంగతి తెలిసిందే.

ఇలా వ్యక్తిగత జీవితంలో కూడా స్నేహా ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఇకపోతే స్నేహ ఎప్పుడు చూసినా మనకు అందంగా చీరకట్టులోనే( Saree ) కనిపిస్తూ ఉంటారు.అయితే స్నేహ కట్టిన చీర మరోసారి కట్టరట.ఇలా ఈమె ఒకసారి వేసుకున్నటువంటి దుస్తులను మరోసారి వేసుకోకపోవడానికి కారణం ఉందంటూ ఇటీవల ఒక సందర్భంలో వెల్లడించారు.

గతంలో ఒక మ్యాగజైన్ తన గురించి న్యూస్ రాస్తూ తాను వేసుకున్న దుస్తులను వేసుకుంటున్నానని పాపం తనకు బట్టలు లేవేమో అన్నట్టు వార్తలు రాశారు.ఆ వార్త కారణంగానే నేను కట్టిన దుస్తులను( Dresses ) మరోసారి కట్టను అంటూ ఈ సందర్భంగా స్నేహ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube