ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి స్నేహ( Sneha ) ఒకరు ఏ విధమైనటువంటి గ్లామర్ షో లేకుండా స్టార్ హీరోయిన్గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి వారిలో స్నేహ ఒకరిని చెప్పాలి.

ఇలా స్నేహ నటించిన సినిమాలలో చాలా పద్ధతిగా కనిపిస్తూనే ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు.

సౌందర్య తర్వాత అదే స్థాయిలో ఈమె గుర్తింపు పొందినప్పటికీ అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు.

"""/" / అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఈమె పలు సినిమాలలో హీరో లేదా హీరోయిన్లకు అక్క వదిన పాత్రలలో నటిస్తున్నారు.

అలాగే బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఇక స్నేహ తన భర్తతో కలిసి పలు బ్రాండ్ లను ప్రమోట్ చేస్తూ భారీ స్థాయిలోనే సంపాదిస్తున్నారని చెప్పాలి.

ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె తమిళ నటుడు ప్రసన్న( Prasanna ) అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

వీరిద్దరికీ ఇద్దరు సంతానం అనే సంగతి తెలిసిందే.ఇలా వ్యక్తిగత జీవితంలో కూడా స్నేహా ఎంతో సంతోషంగా ఉన్నారు.

"""/" / ఇకపోతే స్నేహ ఎప్పుడు చూసినా మనకు అందంగా చీరకట్టులోనే( Saree ) కనిపిస్తూ ఉంటారు.

అయితే స్నేహ కట్టిన చీర మరోసారి కట్టరట.ఇలా ఈమె ఒకసారి వేసుకున్నటువంటి దుస్తులను మరోసారి వేసుకోకపోవడానికి కారణం ఉందంటూ ఇటీవల ఒక సందర్భంలో వెల్లడించారు.

గతంలో ఒక మ్యాగజైన్ తన గురించి న్యూస్ రాస్తూ తాను వేసుకున్న దుస్తులను వేసుకుంటున్నానని పాపం తనకు బట్టలు లేవేమో అన్నట్టు వార్తలు రాశారు.

ఆ వార్త కారణంగానే నేను కట్టిన దుస్తులను( Dresses ) మరోసారి కట్టను అంటూ ఈ సందర్భంగా స్నేహ తెలిపారు.

వరస గా ఫ్లాప్ సినిమాలు.. రూటు మార్చిన నాగార్జున.. మామూలు తెలివి కాదు కదా