అక్కడ యాసిడ్ పోస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు.. ఎస్తర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో విడాకులు తీసుకున్న విడిపోయిన జంటల్లో నోయల్ సీన్,( Noel Sean ) ఎస్తర్( Ester Noronha ) జంట ఒకటి.పెళ్లైన కొంత కాలానికి వీళ్లు విడిపోయిన విషయం తెలిసిందే.

 Actress Ester Noronha Sensational Comments On Ex Husband Noel Sean Details, Este-TeluguStop.com

హీరోయిన్ ఎస్తర్‌ 1000 అబద్దాలు అనే సినిమాతో టాలీవుడ్‌కీ ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత ఆమె ఎన్నో సినిమాల్లో నటించింది.

ఇందులో సునీల్‌తో కలిసి నటించిన భీమవరం బుల్లోడు చిత్రం మాత్రమే మంచి పేరును తీసుకొచ్చింది.ఆ తర్వాత గరం, జయ జానకి నాయక’ వంటి కొన్ని సినిమాల్లోనూ కనిపించింది.

ఈ మధ్య ఎన్నో సినిమాలు, సిరీస్‌లలో చేసింది.

వరుస ఆఫర్లతో సాగిపోతోన్న సమయంలోనే ఎస్తర్.

సింగర్ కమ్ యాక్టర్ నోయల్‌తో ప్రేమలో పడింది.ఆ తర్వాత వీళ్లిద్దరూ చాలా కాలం పాటు సీక్రెట్‌గా ప్రేమాయణం నడిపించారు.

ఇది బహిర్గతం అయిన తర్వాత తమ ప్రేమను బహిర్గతం చేసుకున్నారు.ఈ క్రమంలోనే 2019లో ఈ జంట తమ కుటుంబ పెద్దల సమక్షంలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది.

లవ్ మ్యారేజ్( Love Marriage ) చేసుకున్న కొన్ని రోజులకే నోయల్ సీన్ – హీరోయిన్ ఎస్తర్ మధ్య మనస్పర్థలు వచ్చాయి.దీంతో ఇద్దరూ అప్పటి నుంచి దూరంగా ఉండిపోయారు.

అయితే, ఈ విషయాన్ని మాత్రం ప్రపంచానికి తెలియనీయలేదు.

Telugu Ester Noronha, Noel, Noel Sean, Noelsean, Sensational-Movie

ఇలాంటి పరిస్థితుల్లో కొన్నేళ్ల క్రితమే న్యాయ బద్ధంగా విడాకులు( Divorce ) తీసుకున్నట్లు ఇరువురూ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు ఈ విషయాన్ని తెలిపారు.అయితే విడాకులు తీసుకున్న తర్వాత ఎస్తర్ విడాకులకు గల కారణాలను చాలా కాలం పాటు ఎప్పుడూ చెప్పలేదు.కానీ, ఈ మధ్య తరచూ దీనిపై మాట్లాడుతోంది.

ఇలా తాజాగా తన విడాకుల విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో స్పందించింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.

పెళ్లైన 16 రోజులకే నోయల్ నిజస్వరూపం తెలుసుకున్నాను.అందుకే అతడి నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నాను.

ఈ కారణంగానే అంత త్వరగా విడాకులు తీసేసుకున్నాను.

Telugu Ester Noronha, Noel, Noel Sean, Noelsean, Sensational-Movie

నాతో విడిపోయాక నోయల్ నాపై చెడు ప్రచారం చేస్తూ వచ్చాడు.బిగ్ బాస్ షోలో ( Bigg Boss ) సింపతీ వచ్చేలా మా విడాకుల ఇష్యూను బయటకు తెచ్చాడు.దీంతో ప్రేక్షకుల్లో సానుభూతి పొందాడు.

అప్పుడే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని నాకు అనిపించింది.అలాగే నోయల్ నా గురించి బ్యాడ్‌గా మాట్లాడుతూ చేసిన దానికి అందరూ నాదే తప్పు అనుకున్నారు.

దీంతో నాపై చాలా మంది ట్రోల్స్ చేశారు.ఒక వ్యక్తి అయితే హైదరాబాద్ వస్తే యాసిడ్ పోస్తానని బెదిరిస్తూ పోస్టు పెట్టాడు.

అసలు మా మధ్య ఏం జరిగిందో నాకే తెలుసు.నేను మౌనంగా ఉండడం వల్లే ఇలా జరిగింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఎస్తేర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube