బోరన్న గారి కన్నీటి లేఖ

నల్లగొండ జిల్లా:కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ కన్వీనర్ బోరన్న గారి సుభాష్ చంద్రబోస్ నేతాజీ 9848540078 సభ్య సమాజానికి కన్నీటి లేఖ రాశారు.క్షమించు ఇంద్ర కుమార్ మేఘవాలె -ఈ దేశ భవిష్యత్తు అయిన నిన్ను చంపి-మరోసారి కులం విజయం సాధించింది.

 Boranna's Tearful Letter-TeluguStop.com

మనిషిని మనిషిగా చూడలేని అంధ సమాజం మధ్య అడుగులు వేసే నీలాంటి పసి హృదయాలను ఎట్ల కాపాడాలి బిడ్డా!3-వ తరగతి చదువుతున్న బిడ్డా ఇంద్ర,నీ జీవితాన్ని చదువుల తల్లి సరస్వతి సాక్షిగా చిదిమేసిన చైల్ సింగ్ ఒక ఆయుధం మాత్రమే,చైల్ సింగ్ అనే కత్తిని నీ మెడపై దూసిన భూతమే కులం.సాక్షాత్తు దేవుడే ఉండే గుడిలో మొదలైన ఈ కులవివక్ష,ఇద్దరిని కలిపే పెళ్ళిలో,నలుగురు తినే బంతిలో,అందరూ నడిచే దారిలో,పనిచేసే ప్రదేశంలో,ఆఖరికి బొందల గడ్డలో ఎక్కడ చూసినా ఈ కులం కత్తి దూస్తూనే ఉంది.

అంటు-ముట్టు అంటూ మొదలై,అన్ని రంగాల్లో చీడలా పాకిన ఈ కుల వివక్ష వైరస్ కు టీకా కనిపెట్టేది ఎన్నడో కదా!ఈ దేశంలో పేదరికం- నిరుద్యోగం-అవినీతి నా దృష్టిలో సమస్యలే కాదు.అసలైన సమస్య సామాజిక సాంస్కృతిక వివక్ష,ఇది అంతమైన నాడు అణచివేతకు గురవుతున్న ప్రజలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది,ఆకాశాన్ని అందుకునే ఆలోచన వస్తుంది,అభివృద్ధి పెరుగుతుంది.

రండి ఒక్కో ప్రాణం పోయినప్పుడైనా కనీసం కాకుల్లా అరుద్దాం.ఇంద్ర కుమార్ మేఘవాలెని స్కూల్లోనే చంపిన టీచరు చైల్ సింగ్ ను ఉరి తీసే దాక గొంతెత్తుదాం.

ప్రతి సమావేశంలో ఈ సంఘటనను ఖండించండి,పసి బిడ్డకు నివాళి అర్పించండి.మీ మీ గ్రామాల్లో క్యాండిల్ ర్యాలీ తియ్యండి.

రోడ్ల కూడలిలో మానవహారంతో నిరసనలు నిర్వహించండి.ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ ఇవ్వండి.

మరో బిడ్డ ప్రాణాలు పోకుండా శాంతియుత దీక్షలు చేపట్టిండి.మానవ హక్కుల సంఘాలు మాట్లాడాలి.

సామాజిక సేవా సంస్థలు గొంతు విప్పాలి.రాజకీయ నాయకులు అసెంబ్లీ,పార్లమెంటలను స్తంబించేలా,ఈ బిడ్డకు న్యాయం జరిగేలా పోరాడాలి.

విద్యార్థులు అందరూ ఈ వివక్ష పూరిత హత్యను ఖండించాలి.ఉపాధ్యాయులు అందరూ ఈ కీచక టీచర్ ని ఉరితీయాలని పోరాడాలి.

కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ కన్వీనర్ బోరన్న గారి సుభాష్ చంద్రబోస్ నేతాజీ భారతీయ శ్రామిక దళ్ డి ఎస్ డి చైర్మన్ సుప్రజా దీప్తి రాణి ఝాన్సీ మహాలక్ష్మి భాయ్ భారతీయ జనతా రాజ్యాధికారం ప్రెసిడెంట్ బి జె ఆర్ సర్దార్ పటేల్ బలహీనవర్గాల రాజ్యాధికారం బి వి ఆర్ ప్రెసిడెంట్ బి.వి.ఆర్ మహాత్మా గాంధీజీ కుల నిర్మూలన మతసామరస్యం సామాజిక పరివర్తన లక్ష్యంగా ప్రజా ఉద్యమాలు చేపట్టాలని పేర్కొన్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube