త్రిష- తెలుగు సినిమా పరిశ్రమతో పాటు.సౌత్ ఇండియన ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది.
అందరు టాప్ హీరోలతో తను కలిసి నటించింది.అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నా.
ఇప్పటికీ క్రేజీ హీరోయిన్ గానే ముందుకు సాగుతుంది.ప్రస్తుతం సినిమా కెరీర్ అంతగా ఊపుమీద లేకపోవడంతో పెళ్లి చేసుకుని సంసార జీవితాన్ని గడపాలి అనుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
కొంత కాలం క్రితం త్రిష పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యింది.ఏం జరిగిందో తెలియదు కానీ పెళ్లి పీటల వరకు వచ్చి ఆ మ్యారేజ్ ఆగిపోయింది.
ఆ తర్వాత మళ్లీ పెళ్లి గురించి ఆలోచించలేదు.
ప్రభాస్ తో కలిసి వర్షం సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోయింది.
అనంతరం తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ సినిమాల్లో హీరోయిన్ గా రాణించింది.తన 20 ఏండ్ల సినిమా కెరీర్ లో 10 ఏండ్ల పాటు టాప్ హీరోయిన్ గా కొనసాగింది.
ప్రస్తుతం వస్తున్న కుర్ర హీరోయిన్ల దెబ్బకు త్రిష తెరమరుగయ్యే అవకాశం తలెత్తింది.ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకుని సినిమాల నుంచి కాస్త దూరం జరగాలి అనుకుంటుంది ఈ ముదురు భామ.అయితే గతంలో వరుణ్ మణియన్ అనే నిర్మాతలో ఈమెకు ఎంగేజ్ మెంట్ అయ్యింది.ఎందుకో పెళ్లిమాత్రం జరగలేదు.
తాజాగా ఈమె పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.ఓ వ్యాపారవేత్తతో పెళ్లి నిశ్చయం అయినట్లు తెలుస్తుంది.మరోవైపు నయనతార మాజీ లవర్ శింబును పెళ్లి చేసుకుంటున్నట్లూ వార్తలు వస్తున్నాయి.అందుకే కొత్తగా ఆమె ఏ సినిమాకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.అతి త్వరలో తన పెళ్లికి సంబంధించిన విషయాన్ని త్రిష అఫీషియల్ గా చెప్పే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది.పెళ్లి తర్వాత పూర్తి స్థాయిలో సినిమాలకు గుడ్ బై చెప్పే యెచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం త్రిష.ఒక్క సినిమా మాత్రమే చేస్తుంది.
మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ అనే సినిమాలో నటిస్తుంది.