నల్లగొండ జిల్లా:కేతేపల్లి మండలలో అక్రమంగా తరలిస్తున్న ప్రజా పంపిణీ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మంగళవారం రాత్రి కేతేపల్లి మండల కేంద్రం,చీకటిగూడెం గ్రామాల్లో సోదాలు నిర్వహించిన పోలీసులు రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు.
సతీష్,మహేష్ అనే ఇద్దరు వ్యక్తులు ఓ ఇంట్లో 2 టన్నుల 50 కేజీల నిల్వ చేసిన ప్రజా పంపిణీ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.రేషన్ బియ్యం అక్రమ నిల్వలు ఉంచిన వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కేతేపల్లి ఏఎస్ఐ శ్రీనయ్య తెలిపారు.