ఏపీలోని వైసీపీ సర్కారు ఇబ్బందుల్లో పడింది.ఓ వైపు రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేస్తుండగా.
వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది.అయినా తిమ్మిని బమ్మి.
బమ్మిని తిమ్మి చేయడంలో జగన్ సర్కారు ఆరితేరినట్లు ఉంది.ఒక జిల్లా కాదు.
రెండు జిల్లాలు కాదు ఏకంగా ఆరు జిల్లాలలో రైతులు క్రాప్ హాలీడే ప్రకటించినా సీఎం జగన్ బుకాయింపు మాటలు మాట్లాడుతున్నారు.తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు, గుంటూరు జిల్లాలలోని పలు ప్రాంతాల్లో రైతుల ఖరీఫ్ పంటలు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు.
పశ్చిమ గోదావరులు ప్రకాశం కర్నూలు అనంతపురం(ఉద్యాన) చిత్తూరు సహా గుంటూరులోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ ఏడాది ఖరీఫ్లో పంటలు వేసేందుకు రైతులు ముందుకు రావడం లేదు.నీళ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్తున్నా తాము పంటలు వేయలేమని రైతులు తెగేసి చెప్తున్నారు.
జగన్ హయాంలో రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు.దాదాపు 3 వేల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి బకాయిలు పెట్టింది.
ఇప్పటికీ ఈ నిధులు విడుదల చేయలేదు.మరోవైపు పంట నష్టాలకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి రైతులకు రావాల్సిన నిధులు చేరలేదు.
రైతు భరోసా కేంద్రాల్లోనూ కొనుగోళ్లు సాగడం లేదు.దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

నిజానికి తమది రైతు రాజ్యమని.రైతులకు ఎంతో మేలు చేస్తున్నామని చెప్పుకునే జగన్ సర్కారు ఒకరకంగా ఇబ్బందికర పరిస్థితేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రైతుల క్రాప్ హాలీడే పాపం వైసీపీదే అని ఆరోపించారు.రైతాంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగానే రైతుల పంట విరామ నిర్ణయం తీసుకుంటున్నారని మండిపడ్డారు.
ఏపీలో దాదాపు 11 ఏళ్ల తర్వాత క్రాప్ హాలీడే పరిస్థితులు నెలకొన్నాయని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.రైతుల అండతోనే రాజ్యం చేపట్టిన జగన్ రాజన్న రాజ్యం స్థాపిస్తానని చెప్పగా ఇప్పుడు ఆయన పాలనపైనే అన్నదాతలు కస్సుబస్సులాడే పరిస్థితులు నెలకొన్నాయి.







