ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్

నల్లగొండ జిల్లా: తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష హాల్ టిక్కెట్లు సోమవారం విడుదల చేశారు.హాల్ టిక్కెట్లు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

 Telangana Govt Released Intermediate Hall Tickets, Telangana Govt ,intermediate-TeluguStop.com

మొదటి సంవత్సరం విద్యార్థులు ESSSC లేదా మొదటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్‌తో థియరీ పరీక్ష హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.రెండవ సంవత్సరం వారు మొదటి సంవత్సరం లేదా రెండవ సంవత్సరం హాల్ టిక్కెట్ నంబర్‌తో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

హాల్ టిక్కెట్లలో ఫోటోలు, సంతకాలు ఇతర సవరణలను కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లి వాటిని సరిదిద్దుకునే సౌకర్యం ఉంది.ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 28 నుండి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఆయా తేదీలలో ప్రతిరోజూ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.ఈ ఏడాది 9.8 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube