నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మృగశిర కార్తె నేపథ్యంలో నేడు చేపల మార్కెట్లలో జనం సందడి చేస్తూ కిక్కిరిసిపోయారు.నల్లగొండ, సూర్యాపేట,భువనగిరి జిల్లా కేంద్రాలలోనే కాకుండా జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో నిన్నటి నుండే చేపల మార్కెట్ల హడావుడి మొదలైంది.
మృగశిర కార్తె రోజు చేపలు తినడం ఆనవాయితీగా వస్తున్న తరుణంలో పల్లె,పట్నం అనే తేడా లేకుండా ప్రజలంతా చేపల కోసం బారులు తీరారు.దీనితో వ్యాపారులు చేపల రేట్లను కూడా అమాంతం పెంచేశారని,అయినా కొనకతప్పడం లేదని ప్రజలు చెబుతున్నారు.మృగశిర కార్తె సందర్భంగా వివిధ పట్టణాల్లో కొర్రమేను రూ.400 నుండి రూ.500,మిగిలిన చేపలు రూ.200 నుండి రూ.300 వరకు ధరలు పలుకుతుండడం గమనార్హం.