నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తప్పవు: ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా: వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకుండా నడిపితే కఠిన చర్యలు తప్పవని,జిల్లాలో ప్రతి రోజూ స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ ట్రాపిక్ నిబంధనల విరుద్ధంగా వాహనాలు నడిపే వారిపై చర్యలు తప్పవని బుధవారం నల్లగొండ జిల్లా ఎస్పి చందనా దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు.పట్టణ కేంద్రంలోని స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి ఈ రోజు 25 వాహనాల పైన కేసులు నమోదు చేశామని తెలిపారు.

 Actions Will Be Taken If Vehicles Are Driven Without Number Plates Sp Chandana D-TeluguStop.com

జిల్లాలో చాలా మంది వాహనదారులు తమ వాహనాలకు నంబర్ ప్లేట్స్ లేకుండా ప్రయాణిస్తున్నారని,అది చట్టరీత్యా నేరమని,

ఇకనైనా తమ వాహనాలకు నంబర్ ప్లేట్స్ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఉండాలని, లేనియెడల వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా తిరిగేవారిపై కఠినంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేయబడుతాయని హెచ్చరించారు.

ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనల ప్రకారం నెంబర్ ప్లేట్ వాహనాలకు బిగించుకోవాలని,కొంత మంది నంబర్ ప్లేట్ లేకుండా వాహనాల నడుపుతూ అనేక నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు.అలాగే ప్రతి వాహనానికి నంబర్ స్పష్టంగా కనిపించే విధంగా నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాలని లేనియెడల ఎంవీ ఆక్ట్ క్రింద కేసులు నమోదు చేయబడుతాయని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube