నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తప్పవు: ఎస్పీ చందనా దీప్తి

నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తప్పవు: ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా: వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకుండా నడిపితే కఠిన చర్యలు తప్పవని,జిల్లాలో ప్రతి రోజూ స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ ట్రాపిక్ నిబంధనల విరుద్ధంగా వాహనాలు నడిపే వారిపై చర్యలు తప్పవని బుధవారం నల్లగొండ జిల్లా ఎస్పి చందనా దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు.

నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తప్పవు: ఎస్పీ చందనా దీప్తి

పట్టణ కేంద్రంలోని స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి ఈ రోజు 25 వాహనాల పైన కేసులు నమోదు చేశామని తెలిపారు.

నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తప్పవు: ఎస్పీ చందనా దీప్తి

జిల్లాలో చాలా మంది వాహనదారులు తమ వాహనాలకు నంబర్ ప్లేట్స్ లేకుండా ప్రయాణిస్తున్నారని,అది చట్టరీత్యా నేరమని, ఇకనైనా తమ వాహనాలకు నంబర్ ప్లేట్స్ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఉండాలని, లేనియెడల వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా తిరిగేవారిపై కఠినంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేయబడుతాయని హెచ్చరించారు.

ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనల ప్రకారం నెంబర్ ప్లేట్ వాహనాలకు బిగించుకోవాలని,కొంత మంది నంబర్ ప్లేట్ లేకుండా వాహనాల నడుపుతూ అనేక నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు.

అలాగే ప్రతి వాహనానికి నంబర్ స్పష్టంగా కనిపించే విధంగా నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాలని లేనియెడల ఎంవీ ఆక్ట్ క్రింద కేసులు నమోదు చేయబడుతాయని హెచ్చరించారు.

ఆ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరో సుహాస్.. అక్కడ కూడా సక్సెస్ సాధిస్తారా?