సాధారణంగా చాలామంది పిల్లలు జంక్ ఫుడ్( Junk food ) తినడానికి బాగా అలవాటు అయిపోయారు.అయితే పీచు మిఠాయిని తినాలని అనుకుంటే మాత్రం వారికి ప్రాణహాని తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే పీచు మిఠాయిల వలన ఎన్నో రకాల నష్టాలు కలుగుతున్నాయి అని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.పీచు మిఠాయి వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? నిజంగానే ఇది తినడం వలన ప్రాణహాని జరుగుతుందా? దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.తమిళనాడు ప్రభుత్వాలు పీచు మిఠాయిని బ్యాన్ చేశాయి.అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా పీచు మిఠాయిల( Cotton candy ) శాంపిల్స్ ను టెస్టింగ్ కు పంపించడం జరిగింది.
తమిళనాడులో చేసిన టెస్టింగ్ లో ఈ పీచు మిఠాయిలో క్యాన్సర్( Cancer ) ను ప్రేరేపించే రసాయనాలు ఉన్నాయని తేలింది.దీంతో వీటి అమ్మకాలను తమిళనాడులో నిషేధించడం జరిగింది.
అయితే పీచు మిఠాయిలలో రంగు రావడానికి రొడమైన్ బి అనే రసాయాన్ని ఉపయోగిస్తారట.దీని వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు తేల్చి చెప్పారు.
అందుకే వీటిని ఆయా ప్రాంతాల్లో నిషేధించడం జరిగింది.ఇప్పుడు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఇదే నిర్ణయానికి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాయి.
అయితే రొడమైన్ బి అనేది ఒక సింథటిక్ కలర్.
దీన్ని ఉపయోగించడం వలన రోజ్ కలర్స్ బాగా మెరుస్తూ కనిపిస్తాయి.నిజానికి వీటిని బట్టలు తయారీ, రంగు రంగుల పేపర్స్ తయారు చేయడంలో ఉపయోగిస్తారు.కానీ దీన్ని ఆహారంలో తీసుకుంటే మాత్రం తిప్పలు తప్పవు రొడమైన్ బి (Rhodamine B )లో క్యాన్సర్ కు సంబంధించిన రసాయనాలు ఉన్నాయని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రిజల్ట్స్ అండ్ క్యాన్సర్ ప్రకటించింది.
అయితే వస్త్రాలను తయారు చేయడానికి మాత్రమే ఈ రసాయనాన్ని వాడాలని అనుమతించింది.
అయితే ఒక్క పీచు మిఠాయి మాత్రమే కాకుండా రోజు మిల్క్, జల్లిలో, క్యాండీలో చివరికి కారంపొడి, చెరుకు రసం, ఇలా ఎరుపు రంగు ఉన్న ప్రతి దానిలో కూడా చట్టవిరుద్ధంగా రొడమైన్ బి ని ఉపయోగిస్తున్నారు.కాబట్టి ఈ రసాయనం కలిపిన ఆహార పదార్థాలు తినడం వలన లివర్ సమస్యలు, క్యాన్సర్ సమస్యలు వస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కాబట్టి ఆహార ఉత్పత్తులలో రొడమైన్ బి ఉందో లేదో అన్న విషయం నేరుగా తెలుసుకోవడం కష్టం.
కాబట్టి ఆహార పదార్థాలు రంగురంగులలో మెరుస్తూ కనిపిస్తే ఆ ఆహార పదార్థాలలో రొడమైన్ బి ఉందని అర్థం.కాబట్టి అలాంటి ఆహార పదార్థాలకు చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు దూరంగా ఉండటమే మంచిది.