జాతకంలో కాలసర్ప దోషం( Kalasarpa Dosham ) ఉన్న వ్యక్తికి అతని పనులలో ఎప్పుడు కొన్ని రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.ఏ మంచి పని మొదలుపెట్టిన ఆ పని మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది.
ఇంతకీ జాతకంలో కాలసర్పదోషానికి కారణం ఏమిటి? దానిని ఎలా దూరం చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.ఒక వ్యక్తి జాతకంలో అన్ని గ్రహాలు రాహు, కేతువుల మధ్య వచ్చినప్పుడు అది కాలసర్ప దోషంగా పరిగణించవచ్చు.
వీటి కారణంగా బాధిత వ్యక్తి ముఖ్యమైన పనుల్లో తరచుగా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి.
ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా శుభ ఫలితాలను లభించవు.
సాధారణంగా రాహువు( Rahuvu ) మరియు కేతువు( Ketuvu ) పేర్లు చెప్పగానే ప్రతి ఒక్కరూ ఏదైనా చెడు జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటారు.ఈ రెండు గ్రహాల వల్ల కలిగే దోషాల వల్ల జీవితంలో రకరకాల సమస్యలు వస్తాయి.
రాహువు మరియు కేతువు కాకుండా ఇతర ఏడు గ్రహాలు ఒకవైపున మరియు మరొకవైపు ఏ గ్రహాలు కూడా లేనప్పుడు ఏర్పడిన పరిస్థితిని కాలసర్ప దోషం అని అంటారు.
ముఖ్యంగా చెప్పాలంటే గణేశుని ఆరాధన చేయడం వల్ల కాల సర్ప దోషం యొక్క దుష్ప్రభావాల నుంచి రక్షణ లభిస్తుంది.గణపతి తో పాటు సరస్వతిని పూజించడం వల్ల కాలా సర్ప దోషం దూరమైపోతుంది.మహా దేవుడిని పూజించడం వల్ల అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయని ప్రజలు నమ్ముతారు.
మీ జాతకంలో కాల సర్ప దోషము ఉంటే పూజ చేసేటప్పుడు రుద్రాక్ష జపమాలతో ప్రతిరోజు మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి.
మహాదేవుని ఈ మహా మంత్రాన్ని కనీసం 108 సార్లు కచ్చితంగా జపించాలి.బుధవారం రోజు నిరుపేద వ్యక్తికి నల్లని వస్త్రాలు లేదా మినప పప్పు దానం చేయాలి.అంతేకాకుండా కాలసర్ప దోషం వల్ల మీ పనిలో తరచు ఆటంకాలు ఎదురైతే వాటిని దూరం చేసుకోవడానికి ఒక శివాలయానికి వెళ్లి పెద్ద రాగి పామును తయారు చేసి శివలింగంపై సమర్పించాలి.
అయితే ఈ శివలింగాన్ని ప్రతిష్టించిన తర్వాతే పామును సమర్పించాలి.