వేసవికాలం( Summer ) ప్రారంభం అయినప్పటి నుంచి మనం ఎక్కువగా నిమ్మకాయను( Lemon ) వాడుతూ ఉంటాం.ఈ వేడి వల్ల వచ్చే దాహాన్ని తట్టుకోలేక నిమ్మరసం పిండుకొని తాగుతూ ఉంటారు.
అయితే అదే విధంగా నిమ్మకాయలను కొన్ని వంటకాలలో కూడా వాడుతూ ఉంటారు.ఇక ఎప్పుడూ కూడా నిమ్మ రసాన్ని పిండుకున్న తర్వాత వాటి తొక్కను ( Lemon Peel ) పడేస్తూ ఉంటారు.
కానీ ఆ తొక్కలతోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలియదు.ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మతొక్కలో నిమ్మరసం కంటే ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది.

అలాగే ఫ్లేవనాయిడ్ డి, లేమోనిన్ కూడా ఈ పండు తొక్కలో ఎక్కువగా ఉంటుంది.ఇది శరీరంలోని ముఖ్య భాగాలకు రోగ నిరోధక శక్తిని ఎక్కువగా పెంచేలా సహాయపడతాయి.ఇక ధూమపానం చేసే వారికి, అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారికి, మధుమేహంతో బాధపడుతున్న వారికి ఇలా ఎన్నో సమస్యలతో బాధపడే వారికి ఈ నిమ్మ తొక్కపొడి బాగా ఉపయోగపడుతుంది.
అయితే నిమ్మకాయ తొక్కలో ఉండే సహజమైన ఫ్లేవనాయిడ్, విటమిన్ సి, కెప్టిన్ రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయపడతాయి.

ఇది రక్తపోటును తగ్గిస్తోంది.అలాగే గుండె సంబంధిత సమస్యలను కూడా నివారిస్తుంది.నిమ్మ తొక్కలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ల వలన శరీరంలోని తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగి, క్యాన్సర్ కారక కణాలను నాశనం చేస్తాయి.
అలాగే నిమ్మ తొక్కలో ఉండే ఈ ఆంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే విష వ్యర్ధాలను తొలగిస్తాయి.అలాగే వాపుకు కారణమైన ప్రీ రాడికల్ ఎలిమెంట్స్ తో పోరాడుతాయి.
నిమ్మ తొక్కులో విటమిన్ సి పుష్కలంగా ఉండడం వలన ఇది తక్కువ తీపి సూచికను కలిగి ఉంటుంది.దీంతో ఇది శరీరంలో ఉండే అధిక చక్కెర స్థాయిలో నియంత్రించి మధుమేహం వ్యాధిని అదుపులో ఉంచుతుంది.