టాలీవుడ్ బ్యూటీ ముద్దు గుమ్మ కీర్తి సురేష్ గురించి మనందరికీ తెలిసిందే.మొదట నేను శైలజ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఆ తరువాత తెలుగులో పలు సినిమాల్లో నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.
ఇదిలా ఉంటే గత కొద్ది కాలంగా కీర్తి సురేష్ తన కెరీర్లో ఒక సూపర్ హిట్ సినిమా కోసం వెయిట్ చేస్తోంది.అయితే ఆ సూపర్ హిట్ సినిమా కూడా సూపర్ స్టార్ సరసన నటించిన సినిమా పెద్ద విజయం అని సురేష్ కోరుకుంటోంది.
అయితే గత రెండు మూడేళ్లలో కీర్తి సురేష్ కు సరైన హిట్ లేదు.ఇకపోతే కీర్తి సురేష్ తాజాగా నటించిన చిత్రం సర్కారు వారి పాట.
కీర్తి సురేష్ ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకుంది.అంతేకాకుండా మహేష్ బాబు తనకు లక్కీ ఛామ్ మారతాడని కీర్తి సురేష్ ఆకాంక్షిస్తోంది.
సర్కారు వారి పాట హిట్టైతే ఆమెకు టాలీవుడ్ స్టార్స్ కూడా ఆఫర్లు ఇచ్చే ఛాన్స్ ఉందని కీర్తి ఫ్యాన్స్ భావిస్తున్నారు.సర్కారు వారి పాట సినిమా ఒక భారీ బడ్జెట్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాగా తెరకెక్కబోతోంది అన్న సంగతి తెలిసిందే.
ఇకపోతే ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు మంచిగానే మార్కులు పడతాయి అని ఇటీవలే విడుదలైన ట్రైలర్ ను చూస్తే తెలుస్తోంది.ట్రైలర్ కి కూడా ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
ఇది ఇలా ఉండే కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదలకు ముందే కీర్తి సురేష్ నటించిన తాజా ఓటీటీ చిత్రం చిన్ని సినిమాతో మంచి హిట్ సాధించింది.

ఈ సినిమా విడుదల అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు కీర్తి నటనకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.ఈ చిన్ని సినిమాలో కీర్తి సురేష్ ఒక సీరియస్ రోల్లో నటించగా అందుకు గాను ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.ఇది పవన్ కళ్యాణ్ ఇదివరకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి అగ్రహీరోలతో అజ్ఞాతవాసి లాంటి సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు ఎందుకనో అదృష్టం వరించడం లేదు.
కానీ ప్రస్తుతం కీర్తి సురేష్ తన ఆశలన్నీ కూడా సర్కారు వారి పాట సినిమాపైనే పెట్టుకుంది.అదేవిధంగా మహేష్ బాబు తన ఫేట్ ని మారుస్తాడు అని మహేష్ బాబుపై నమ్మకం పెంచుకొంది.
సర్కారు వారి పాట సినిమా మే 12న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే.ఇక ఈ చిత్రబృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
.