Superstar Krishna: కృష్ణ బ్రతికి ఉండి ఉంటే ఈ నేరాలు ఘోరాలు జరిగేవా?

నరేష్ మళ్లీ పెళ్లి సినిమాతో అనేక అంశాలు మీడియాలో చర్చకు వస్తున్నాయి.నరేష్( Actor Naresh ) మూడు పెళ్లిళ్ల వ్యవహారాలు అలాగే పవిత్ర లోకేష్ తో( Pavitra Lokesh ) ప్రేమాయణం, కృష్ణ మరణం తర్వాత జరిగిన అనేక సంఘటనలు మరోసారి నెటిజన్స్ మాట్లాడుకునేలా చేస్తున్నాయి.

 There Will Be No Messip If Krishna Alive-TeluguStop.com

ఇక నరేష్ వ్యవహారంలో జరుగుతున్న విషయాల గురించి సూపర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ) తమ్ముడు ఆదిశేషగిరిరావు ( Adiseshagiri Rao ) కూడా తాజాగా స్పందించారు.నరేష్ కి మాకు ఏంటి సంబంధం అతని విషయాల గురించి మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటూ ఎదురు దాడి చేయడం కూడా మనం చూసాం.

ఈ పరిణామాల నేపథ్యంలో విజయనిర్మల కృష్ణ కనుక బ్రతికి బ్రతికి ఉండి ఉంటే ఈరోజు చాలా సంఘటనలు జరిగి ఉండేవి కాదు అంటూ కొంతమంది కృష్ణ అభిమానులు అనుకుంటున్నారు.

Telugu Ghattamaneni, Krishna, Mahesh Babu, Malli Pelli, Naresh, Nareshpavitra, P

కృష్ణ చనిపోయిన తర్వాత నరేష్ ని పూర్తి స్థాయిలో తమ కుటుంబ వ్యక్తి కాదు అన్నట్టుగా ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నప్పటికీ ఎవరు అవునన్నా కాదన్నా కృష్ణ ఇంటి సభ్యుడు గానే నరేష్ చివరి వరకు ఉన్నాడు.కృష్ణ ఆస్తిలో నరేష్ కి ఎలాంటి వాటా ఉండదు అలాగే విజయనిర్మల ఆస్తిలో కృష్ణ వారసులకు కూడా ఎలాంటి సంబంధం ఉండదు అనేది ముందు నుంచి అందరు అంటున్న మాటే.ఆస్తుల విషయంలో ఎలాంటి పొత్తులు లేకపోయినా విజయ నిర్మల కట్టుకున్న ఇంట్లోనే కృష్ణ తన చివరి శ్వాస విడిచాడు.

ఆయన మంచి చెడు అన్ని చూసుకున్నది నరేష్ మాత్రమే.

Telugu Ghattamaneni, Krishna, Mahesh Babu, Malli Pelli, Naresh, Nareshpavitra, P

అలాగే కృష్ణ కూడా తన సొంత పిల్లల్లా కాకపోయినా నరేష్ ని ఎప్పుడు నిరాధారణకు గురి చేయలేదు.తనకు కొడుకు కాదు అన్న విధంగా ఎప్పుడు పక్కన పెట్టలేదు.అతడి ఇంట్లోనే ఉంటూ అతని ద్వారానే మంచి చెడులు అన్ని చూసి చివరికి ఆ ఇంట్లోనే కన్నుమూశాడు కృష్ణ.

ఇప్పుడు ఆదిశేషగిరి రావు నరేష్ కి మాకు ఏ సంబంధం లేదు అని అంటున్నప్పటికీ కృష్ణ బతికి ఉండి ఉంటే ఆ మాట అనగలిగే వాడా.మహేష్ బాబు( Mahesh Babu ) కూడా ఎప్పుడూ నరేష్ కు మద్దతు పలికింది లేదు కానీ మహేష్ బాబు అన్ని విషయాల్లోనూ నరేష్ ముందుండి నడిపించాడు.

కృష్ణ బతికి ఉండి ఉంటే ఈరోజు మళ్లీ పెళ్లి( Malli Pelli Movie ) అనే సినిమా కూడా వచ్చి ఉండేది కాదు సైలెంట్ గానే విడాకుల తంతు లేదా పెళ్లి తంతు ముగిసిపోయేది కానీ రచ్చకెక్కి గొడవలు పెట్టుకునే వారు కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube