నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో గత రెండు రోజులుగా దాదాపు 7 వార్డులో వీధి కుక్కలకు మున్సిపల్ సిబ్బంది విషం పెట్టగా సుమారు 70 కుక్కల దాకా మృతి చెందినవి.మృతి చెందిన కుక్కల శవాలను డంపింగ్ యార్డులో గుట్టుచప్పుడు కాకుండా పూడ్చి వేస్తున్నారు.
ఇప్పటికే డంపింగ్ యార్డ్ వలన వచ్చే దుర్వసనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.ఇపుడు కుక్కల శవాలను డంపింగ్ యార్డులో పూడ్చడం వలన మరింత దుర్గంధం వెదజల్లి, తద్వారా రోగాల బారిన పడే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి మృతి చెందిన కుక్కల శవాలను నివాసాలకు దూరంగా తరలించి లోతైన గుంతలో పూడ్చి వేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.