వేసవికాలం( summertime ) రానే వచ్చింది.ఎండలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి.
వేసవిలో భానుడి భగభగలకు తట్టుకుని నిలబడాలంటే బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా అవసరం.లేదంటే వడదెబ్బ, నీరసం, అలసట, కళ్లు తిరగడం వంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.
అయితే వేసవికాలంలో బాడీని హైడ్రేటెడ్ గా మరియు బరువు తగ్గడానికి సహాయపడే అద్భుతమైన జ్యూస్ ఒకటి ఉంది.ఈ జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో కనుక చేర్చుకుంటే అదిరిపోయే ఆరోగ్య లాభాలు ను పొందుతారు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సమ్మర్ హెల్తీ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు పియర్ పండు( Pear fruit ) ముక్కలు వేసుకోవాలి.
అలాగే అర కప్పు తొక్క తొలగించి తరిగిన కీర ముక్కలు, అర కప్పు కివి పండు( Kiwi fruit ) ముక్కలు మరియు వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి.చివరిగా ఒక గ్లాసు ఫ్రెష్ కొబ్బరి నీళ్ళు( coconut water ) వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.
ఆపై స్టైనర్ సహాయంతో జ్యూస్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు అరగంట ముందు ఈ పియర్ కీరా కివీ జ్యూస్( Kiwi juice ) ను తీసుకోవాలి.వేసవికాలంలో నిత్యం ఈ జ్యూస్ ను సేవించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.ఈ హెల్తీ జ్యూస్ శరీరంలో నీటి నిల్వలు తగ్గకుండా అడ్డుకట్ట వేస్తుంది.
బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

వడదెబ్బకు గురికాకుండా రక్షిస్తుంది.వేసవి వేడిని తట్టుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది.అలాగే ఈ జ్యూస్ బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి అద్భుతంగా తోడ్పడుతుంది.
ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు కేలరీలు ఐసు ముక్కలా కరిగిపోతాయి.దాంతో వేగంగా బరువు తగ్గుతారు.అంతేకాకుండా ఈ జ్యూస్ చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా మెరిపిస్తుంది.రక్త పోటును కంట్రోల్ చేస్తుంది.
మరియు రోజంతా మిమ్మల్ని ఎనర్జిటిక్ గా సైతం ఉంచుతుంది.