ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case )లో భాగంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే ఉన్న ఆయనను ఇవాళ ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue court )లో హాజరుపర్చనున్నారు.
ఈ క్రమంలోనే కేజ్రీవాల్ రిమాండ్ రిపోర్టును ఈడీ న్యాయస్థానం ముందు ఉంచనుంది.ఈ మేరకు ఆయనను పది రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేయనుందని తెలుస్తోంది.
కాగా కేజ్రీవాల్ అరెస్ట్( Arvind Kejriwal Arrest ) నేపథ్యంలో ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.ఈడీ కార్యాలయంతో పాటు రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ దగ్గర పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.