నల్లగొండ జిల్లానాగార్జున సాగర్ ఎడమ కాలువకు మరో ప్రమాదం పొంచి ఉందా అంటే అవుననే అంటున్నారు ఆ ప్రాంత రైతాంగం.శనివారం హాలియా పట్టణంలోని శివాలయం సమీపంలో సాగర్ ఎడమ కాలువకు తెగేందుకు సిద్ధంగా ఉన్న సైడ్ లైనింగ్ వాల్ ను గుర్తించారు.
కొద్ది రోజుల క్రితం ముప్పారం వద్ద సాగర్ ఎడమ కాలువకు పడిన గండితో ఆ ప్రాంతంలో ఇసుక మేటలు వేయడంతో భారీగా నష్టం వాటిల్లింది.నీరందక వేల ఎకరాల్లో పంట నష్టపోయిన సంగతి తెలిసిందే.
ఆ నష్టం నుండి అన్నదాత తేరుకొకముందే మళ్ళీ మరోచోట కాలువకట్ట తెగేందుకు అవకాశం ఉందని తెలియడంతో అన్నదాతలు ఆందోళనలో పడిపోయారు.ఏ క్షణమైనా ఎడమ కాలువకు మరోసారి గండి పడుతుందని తెలియడంతో సమీప గ్రామాల ప్రజలు,రైతులు భయాందోళనలకు గురవుతున్నారు.
నష్టంజరగక ముందే ఎన్ఎస్పీ అధికారులు మరమ్మత్తులు చేపట్టాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.