గుంటూరు జిల్లా మంగళగిరిలో భారీ వర్షం కురిసింది.ఆర్ -5 జోన్ లో ఇళ్ల స్థలాల లే అవుట్ల నిర్మాణ పనుల్లో ఉన్న కొందరు సచివాలయ సిబ్బంది వర్క్ చేస్తున్నారు.
వర్షం పడుతున్న నేపథ్యంలో సిబ్బంది టెంట్ కిందకు వెళ్లారు.వర్షం, ఈదురు గాలి ధాటికి టెంట్ ఒక్కసారిగా కూలడంతో దాదాపు 20 మంది సిబ్బంది గాయపడ్డారని తెలుస్తోంది.
పలువురు బురదలో చిక్కుకునిపోయారు.స్పందించిన ఇతర సిబ్బంది బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.







