గత్యంతరం లేక మొలకెత్తిన ధాన్యంతో రోడ్డెక్కుతున్న రైతన్నలు…!

నల్లగొండ జిల్లా: నకిరేకల్ మండలం తాటికల్లు గ్రామంలోని ఐకెపి కేంద్రంలో అకాల వర్షాలతో తడిసి మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని గురువారం నల్లగొండ-నకిరేకల్ ప్రధాన రహదారిపై రైతులు మొలకెత్తిన ధాన్యంతో బైఠాయించి ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని గొప్పలు చెప్పుకోవడం తప్పా రైతుల పక్షపాతిగా ఎప్పుడైనా వ్యవహరించారా అని రైతులు ప్రభుత్వం,ప్రజా ప్రతినిధులపై నిప్పులు చెరిగారు.

ధాన్యం కొనేవారే లేరా? రైతుల కష్టం పాలకులకు పట్టదా? అని ప్రశ్నించారు.అధికారుల నిర్లక్ష్యం వల్లే కాంటాలు సకాలంలో కాక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని మ్యాచర్ తో సంబంధం లేకుండా గిట్టుబాటు ధర కల్పించి వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

రైతులు నిరసన వ్యక్తం చేయడంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని లేనియెడల ధర్నా కొనసాగిస్తామని హెచ్చరించారు.

అండర్‌వేర్స్‌ను టీ-షర్ట్స్‌గా వేసుకున్న యువకులు.. వీడియో చూస్తే షాక్ అవుతారంతే..??