మళ్ళీ దొరికిపోయిన కేటీఆర్?

నల్లగొండ జిల్లా:మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో మంత్రి కేటీఆర్ వైఖరి వివాదాస్పదంగా మారింది.ప్రచార సమయంలో గట్టుప్పల్ కి చెందిన బీజేపీ నేతతో ఫోన్లో మాట్లాడి విమర్శలు ఎదుర్కొన్న కేటీఆర్,మరోసారి ఎన్నిక జరుగుతున్న సమయంలో అదే గట్టుప్పల్ మండలం రంగ తండ,హజిన తండా వాసులతో మంత్రి కేటీఆర్ ఫోన్ మాట్లాడటం సంచలనంగా మారింది.

 Ktr Found Again?-TeluguStop.com

ప్రచార గడువు ముగిసే వరకు ఎటువంటి హామీలు ఇవ్వకూడదనే ఎన్నికల నియమావళి ఉన్నప్పటికి అందుకు విరుద్ధంగా పోలింగ్ జరుగుతుండగానే మంత్రి కేటీఆర్ పోలింగ్ జరుగుతున్న ప్రాంతంలోని ఓటర్లతో ఫోన్ లో మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.తండావాసులతో మాట్లాడిన కేటీఆర్ రంగం తండ,హజిన తండా వాసులపై హామీల వర్షం కురిపించారు.

ఈరెండు తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని హామీ ఇచ్చారు.తండాల్లోని రోడ్డు వేస్తామని చెపుతూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేయాలని అభ్యర్థించారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.పోలింగ్ సమయంలో మంత్రి కేటీఆర్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని హామీలు ఇస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube