CM KCR Press Meet: 8 ప్రభుత్వాలు కూల్చినం మరో 4 ప్రభుత్వాలను కూల్చుతం అంటున్నారు - కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ కామెంట్స్.ఇందిరా గాంధీ కి దేశంలో ఎదురులేదు అనుకున్న సమయంలో ఎమర్జెన్సీ ఆమెను ముంచింది.

 Cm Kcr Fires On Central Bjp Government Operation Akarsh On Trs Mlas Details, Cm-TeluguStop.com

ఒళ్ళు మరిచి బీజేపీ అరాచక ఖండా, జుగుప్సాకరంగా ఉంది.స్వయంగా ప్రధానమంత్రి వెస్ట్ బెంగాల్ లో టీఎంసీ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని చెప్తున్నారు.

దేశం దెబ్బతింటే వంద ఏళ్ళు వెనక్కి వెళతాం.ఏ బలాన్ని చేసుకోని ఈ ప్రవర్తనలో ఉన్నారు.ఎంత అహంకారం ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడుతారు.8 ప్రభుత్వాలు కూల్చినం – మరో 4 ప్రభుత్వాలను కూల్చుతం అంటున్నారు.రాజస్థాన్, తెలంగాణ, ఏపీ, ఢిల్లీ ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్ర చేశారు.ఆ ముఠాను పట్టుకున్నాం కాబట్టి ఈ విషయాలన్నీ తెలిశాయి.ముఠా మొత్తం 24 మంది ఉన్నారు.ఒక్కొక్కరికి రెండు రెండు ఆధార్ కార్డులు ఉన్నాయి.

తుషార్ అనే వ్యక్తి రాహుల్ గాంధీ పై వాయినాడ్ లో పోటీ చేశారు.

పాన్ కార్డ్స్ మూడేసి చొప్పున, డ్రైవింగ్ లైసెన్స్ మూడేసి చొప్పున ఉన్నాయి.

దేశం కోసం చనిపోవాల్సి వస్తే చస్తాం.ఈవీఎం వివిప్యాడ్ లపై కూడా ఈ ముఠా మాట్లాడుతోంది.

ఎట్టి పరిస్థితుల్లో ఈ దుర్మార్గం దేశంలో నదువొద్దు.ఒక కేస్ లాగా చూడొద్దు.

దేశంలో ప్రజాస్వామ్యం రక్షించబడాలీ.శాంతిభద్రతలకు విఘాతం అవుతుంది.ఒకరిపై ఒకరు హత్యలు చేసుకుంటారు.అన్ని రాష్ట్రాల డీజీపీలకు ఈ ఆధారాలు పంపుతున్నాం.డైరెక్ట్ గా ప్రధానమంత్రి తో టచ్ లో ఉన్నాం అని చెప్తున్నారు.ఈ ముఠా చెప్పే అంశాలన్నీ బయటకు రావాలి.

మీకు కాంట్రాక్టలు ఇస్తాం అని చెప్పడానికి వీళ్ళు ఎవరు? మేము కలుపుకున్నాం…రాజ్యాంగ బద్ధమైన నిబంధనలకు లోబడి మేము ఎమ్మెల్యేలను కలుపుకున్నాం.

Telugu Amith Sha, Bj Santosh, Bjp Akarsh, Central Bjp, Cm Kcr, Jp Nadda, Kcr, Na

మేము ఎమ్మెల్యేలను కొనలేదు…అభివృద్ధి కలుస్తాం అంటే కలుపుకున్నాం.నా ప్రభుత్వాన్ని కులగొడుతాం అంటే నేను చూస్తూ ఉరుకోవాలా.బీఎల్ సంతోష్ ను మొదట టచ్ చేస్తారు…తరువాత అమిత్ షా, నడ్డా ను కలుస్తారు.

తుషార్ అనే వ్యక్తి బేరం అంతా మాట్లాడారు.ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని దుర్మార్గంగా కూలుస్తే అందరం కలిసి కొట్లాడినం.

అయితే గోడి, లేకపోతే ED అని సోమయాజి చెప్తున్నారు.ఈ ముఠా నాయకులు ఎవరు? ఈ ముఠాకు డబ్బులు ఎవరు సమకూర్చుతున్నారు? అన్ని విషయాలు బయటకు రావాలి.ఢిల్లీ ఎయిమ్స్ లో సోమయాజి ఆఫీస్ ఉంది అంటున్నారు.

భారత న్యాయ వ్యవస్థ దేశాన్ని కాపాడాలి.2015 నుంచి ఈ 24మంది ముఠా వ్యవహారం…ఈ ముగ్గురి ఫోన్ కాల్ డేటా అంతా బయటకు వచ్చింది.వీళ్ళ డేటా వేల పేజీలలో ఉంది.

దేశం ఇప్పుడు కొత్త పందా పట్టాలి.ప్రధానమంత్రి మోడీని విజ్ఞప్తి చేస్తున్నా.

ఇలాంటి రాజకీయాలను ఆపండి.దేశానికి రెండు సార్లు పీఎం అయ్యారు.

ఇక నుంచైనా మంచిపేరు సాధించండి.దేశంలో యువత మేల్కోవాలి.

దేశంలో ఇంకా న్యాయం బతికే ఉంది…నాకు పూర్తి నమ్మకం ఉంది.నా పార్టీ గుర్తు కోసం కోర్టుకు వెళ్లి గెలిచాను.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube