మొటిమలు, నల్లని మచ్చలు, బ్లాక్ హెడ్స్ అనేవి ముఖాన్ని అందవిహీనంగా మారుస్తాయి.ముఖం మీద వచ్చే బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ముక్కు మీద వచ్చి అసహ్యంగా కనిపిస్తాయి.
కొన్ని సార్లు ఎన్ని కాస్మోటిక్స్ ఉపయోగించిన సరైన ఫలితం రాదు.అప్పుడు సహజమైన పద్దతులతో చాల సులభంగా పరిష్కారం అవుతుంది.
అలాంటి సులభమైన చిట్కాలతో బ్లాక్ హెడ్స్ ని ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం
ఈ రెమిడీకి కావలసిన పదార్ధాలుటూత్ పేస్ట్ – 1 స్పూన్బేకింగ్ పొడి – 1 స్పూన్గోరువెచ్చని నీరు – సరిపడాటూత్ బ్రష్
ఎలా ఉపయోగించాలిఒక బౌల్ లో గోరువెచ్చని నీటిని తీసుకోని దానిలో టూత్ పేస్ట్ ను, బేకింగ్ పౌడర్ ను వేసి బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న దగ్గర అప్లై చేయాలి.
కొంచెం సేపు అయిన తర్వాత టూత్ బ్రష్ తీసుకుని మెల్లిగా ఆ మిశ్రమం అప్లై చేసిన దానిపై మసాజ్ చేయాలి.తరువాత ఒక నిమిషం పాటు అలానే వదిలేసి పొడి బట్టతో శుభ్రంగా తుడిచి గోరువెచ్చని నీటితో శుభ్రంగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
దాంతో బ్లాక్ హెడ్స్ పోయి మీ ముఖం ఎంతో సున్నితంగా మారుతుంది.ఈ విధంగా రోజు చేస్తూ ఉంటే బ్లాక్ హెడ్స్ తొందరగా తగ్గిపోతాయి.