హెయిర్ ఫాల్. ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా కోట్లాది మందికి కామన్ శత్రువు ఇది.
అయితే హెయిర్ ఫాల్ అనేది కొందరిలో చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది.వీరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
కానీ, కొందరిలో మాత్రం చాలా హెవీగా ఉంటుంది.వీరు హెయిర్ ఫాల్‌ను ఎంత నిర్లక్ష్యం చేస్తే జుట్టు అంత పల్చగా మారుతుంటుంది.
అందుకే జుట్టు ఊడటాన్ని అరికట్టడం కోసం నానా పాట్లు పడుతుంటారు.అయితే హెయిర్ ఫాల్‌కి చెక్ పెట్టడంలో తామర పూలు అద్భుతంగా సహాయపడతాయి.
తామర పూవ్వుల్లో జుట్టుకు ఉపయోగపడే ఎన్నో అమోఘమైన పోషక విలువలు నిండి ఉంటాయి.అవి జుట్టు రాలడాన్నే కాదు వైట్ హెయిర్, హెయిర్ బ్రేకేజ్ వంటి సమస్యలను సైతం దూరం చేస్తాయి.
మరి ఇంతకీ తామర పూలను జుట్టుకు ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మూడు లేదా నాలుగు తామర పువ్వులను తీసుకుని.వాటికి ఉండే రేకలను సపరేట్ చేసుకోవాలి.
ఇలా సపరేట్ చేసి పెట్టుకున్న తామర పువ్వు రేకులను మిక్సీ జార్‌లో వేసుకుని.
మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నెను పెట్టుకుని అందులో తామర పువ్వుల జ్యూస్‌ను వేసి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి.ఆ తర్వాత అందులో మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్ కూడా వేసుకుని ఒక నిమిషం పాటు హీట్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు తయారు చేసుకున్న మిశ్రమాన్ని పూర్తిగా చల్లారిన అనంతరం దూది సాయంతో జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి.
షవర్ క్యాప్‌ను ధరించాలి.రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
ఇలా వారంలో రెండు సార్లు చేశారంటే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు.జుట్టు క్రమంగా ఊడటం తగ్గి.
ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.