టాలీవుడ్ దర్శకుడు రాఘవేంద్ర రావు గురించి మనందరికీ తెలిసిందే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.
ఎంతోమంది నటీనటులు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు.ఇది ఇలా ఉంటే తాజాగా రాఘవేంద్రరావు బాపట్ల జిల్లా చుండూరు మండలం నడిగడ్డ పాలెం గ్రామం వెళ్లారు.
అక్కడ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు.
దర్శకేంద్రుడి కి టిడిపి మాజీ మంత్రులు నక్క ఆనంద్ బాబు ఆలపాటి రాజేంద్రప్రసాద్ అలాగే టిడిపి శ్రేణులు పాల్గొని ఆయనకు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు.విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత దర్శకేంద్రుడు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అధికారం టీడీపీదే నని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా రోజురోజుకీ తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతోందని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు తప్పకుండా అధికారం చేపట్టడం ఖాయమని తెలిపారు.అన్నగారు ఎన్టీఆర్ సాక్షిగా చెబుతున్నాను ఈ వేదిక మీద ఉన్న నాయకులు సంవత్సరాల తర్వాత ఉన్నత పదవుల్లో ఉంటారని తెలిపారు రాఘవేంద్ర రావు.
అలాగే తనకు దర్శకుడిగా మంచి గుర్తింపు ఇచ్చిన ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయితే సినిమాల్లో జన్మనిచ్చింది మాత్రం ఎన్టీఆర్ అని తెలిపారు.ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది కేవలం ఎన్టీఆర్ వల్లే అని తన సినీ ప్రయాణం ఎన్టీఆర్ తోనే మొదలయింది అని తెలిపారు దర్శకేంద్రుడు.విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా దర్శకేంద్రుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.