పరుచూరి బ్రదర్స్.సినిమా పరిశ్రమలో పరిచయం అక్కరలేని పేరు.ఒకప్పుడు హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేవారు ఈ అన్నాదమ్ములు.300 సినిమాలకు పైగా రచయితలుగా పనిచేశారు.సినిమా రచయితల స్థాయిని పెంచడంలో వీరి శ్రమ మరువలేనిది.చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు.అందరితోనూ కలిసి పనిచేశారు పరుచూరి బ్రదర్స్.రైటర్స్ గానే కాకుండా నటులుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
పెద్ద వాడైన పరుచూరి వెంకటేశ్వరరావు చాలా సినిమాల్లో నటించాడు.కారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈ అద్భుత రైటర్స్ తమ కుటుంబంలోని ఓ వారసుడిని హీరోగా చేయాలి అనుకున్నారు.దాని కోసం బేస్ రెడీ చేసుకున్నారు.అనుకోకుండా విధి వెక్కిరించింది.హీరో అవుతాడనుకున్న తమ వారసుడు పాడె ఎక్కాడు.
పరుచూరి వెంకటేశ్వరరావు కొడుకు రఘు బాబు గురించి సినిమా పరిశ్రమలో వారికి తప్ప బయటి వారికి తెలిదు.తను చనిపోయి 30 ఏండ్లు దాటింది.
అప్పట్లో పరుచూరి బ్రదర్స్ ఏడాదికి 20 సినిమాలకు పనిచేసే వారు.ఈ నేపథ్యంలో ప్రేమఖైదీ అనే సినిమా కథ రాసి.
అందులో తన కొడుకును హీరోగా పెట్టాలి అనుకున్నాడు పరుచూరి వెంకటేశ్వరరావు.ఈ సినిమాను నిర్మించేందుకు రామానాయుడు ఓకే చెప్పాడు.
దర్శకుడిగా ఈవీవీ ముందుకొచ్చాడు.అదే సమయంలో రఘుబాబు రవీంద్రభారతిలో నాటకం వేస్తున్నాడు.
మధ్యలోనే రక్తం కక్కుకుని కింద పడ్డాడు.వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
కానీ తను అక్కడే కన్నుమూశాడు.
హీరో కావాల్సిన తన కొడుకు చనిపోవడం పట్ల పరుచూరి బ్రదర్స్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.అప్పటి నుంచి తన పేరిట మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి నాటకాలు వేసే వారికి అవార్డులు అందిస్తున్నారు.ప్రతీ ఏడాది వారం రోజుల పాటు నాటకాలు వేస్తుంటారు.
అందులో మంచి ప్రతిభ కనబర్చిన వాళ్లకు పురస్కారాలు అందిస్తారు.ఆయన పేరట నాటక మండలిని కూడా ఏర్పాటు చేశారు పరుచూరి బ్రదర్స్.
తన కొడుకు భౌతికంగా తమ దగ్గర లేకపోయినా.తనతో గడిపిన క్షణాలను మర్చిపోలేదు అంటాడు పరుచూరి బ్రదర్.