తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ఇవాళ బాధ్యతల స్వీకరణ చేపట్టనున్నారు.హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో కాసాని బాధ్యతలు స్వీకరించనున్నారు.
కాసాని బాధ్యతల స్వీకరణ సందర్భంగా మహా నగరంలో తెలుగు తమ్ముళ్లు సంబురాలు నిర్వహిస్తున్నారు.దీనిలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం నుంచి ఎన్టీఆర్ భవన్ వరకు పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.
దీంతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఎన్టీఆర్ భవన్ వరకు పసుపుమయం కానుంది.
ఈ మధ్యే పార్టీలో చేరిన కాసాని జ్ఞానేశ్వర్ ను అధ్యక్షుడిగా నియమించారు చంద్రబాబు.
ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు.ఇప్పటి వరకు తెలంగాణలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బక్కని నర్సింహులుకు పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించారు.