ఇంద్రజ…( Indraja ) తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో టాప్ హీరోయిన్ గా కొన్నాళ్లపాటు బిజీగానే నటించింది.ఆ తర్వాత ఆ మెల్లిమెల్లిగా అవకాశాలు తగ్గడంతో హీరోయిన్ గా ఇక కంటిన్యూ చేయలేనని అర్థమయిపోయి పెళ్లి చేసుకొని సీరియల్స్ లో బిజీ అయ్యింది.
మళ్లీ ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది.అలాగే టెలివిజన్ షోలలో కూడా పాల్గొంటుంది.
ప్రస్తుతానికి రెండు చేతుల సంపాదిస్తుంది.అయితే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఇంద్రజ ఒక నటుడుతో నటించడానికి ఒప్పుకోలేదట.
మరి అంతకు ముందు నటించిన ఆ నటుడుతోనే మళ్లీ సినిమా చేయడానికి ఎందుకు ఒప్పుకోలేదు ? ఆ నటుడు ఎవరు ? ఆ సినిమా ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇంద్రజ తమిళ అమ్మాయి.
మొదట తమిళ ఇండస్ట్రీలోనే నటిగా ఎంట్రీ ఇచ్చింది.ఇక తెలుగులో మొట్టమొదటగా ఆమె కనిపించిన సినిమా హలో బ్రదర్.
( Hello Brother ) సినిమాలో నాగార్జునతో కలిసి ఒక పాటలో స్టెప్పులేసింది.ఆ తర్వాత ఆమె నటించిన సినిమా జంతర్ మంతర్.
కానీ ఈ చిత్రం ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు.ఆ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి హలో బ్రదర్ సినిమాలో ఇంద్రజను చూసి యమలీల సినిమా( Yamaleela Movie ) కోసం అడిగారు.
అప్పుడు అప్కమింగ్ హీరోయిన్ కాబట్టి ఆలీ( Ali ) పక్కన నటించడానికి ఒప్పుకుంది.ఆయన కూడా అప్పటివరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా పనిచేసి కొన్ని కమీడియన్ గా వేషాలు వేశాడు కాబట్టి హీరోగా అతడికి ఇది తొలి సినిమానే.
అలా యమలీల సినిమాతో ఇంద్రజ అలీ హీరో హీరోయిన్స్ గా నటించి విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది.నిజానికి ఈ సినిమాలో ఇంద్రజ కన్నా ముందు సౌందర్య( Soundarya ) హీరోయిన్ గా అనుకున్నా అది వర్కౌట్ అవలేదు.మరోవైపు ఆలీ స్థానంలో మొదట మహేష్ బాబు( Mahesh Babu ) అనుకున్నా కూడా కృష్ణ గారు అందుకు ఒప్పుకోకపోవడంతో ఆలీని పెట్టి సినిమా తీశారు.యమలీల సినిమా ఘనవిజయం సాధించింది.
ఆలీ ఇంద్రజ కాంబినేషన్ కూడా చాలా హిట్ కాంబినేషన్ గా పేరు సంపాదించుకుంది.
ఆ తర్వాత పిట్టలదొర( Pittaladora Movie ) అనే మరో సినిమా సైతం ఈ ఇద్దరే హీరో హీరోయిన్స్ గా నటించారు.అది కూడా మంచి విజయాన్ని సాధించింది.ఇక నల్లపూసలు, లవ్ గేమ్ అనే మరో రెండు సినిమాల్లో సైతం ఇంద్రజ మరియు అలీ మెయిన్ లీడ్ గా నటించారు.
ఇలా ఆమెకు హిట్స్ పడుతుండటం తో సుమన్, బాలకృష్ణ వంటి పెద్ద హీరోల పక్కన ఆమెకు అవకాశాలు వచ్చాయి.ఆ సమయంలో ఆలీ తన మరో సినిమా కోసం ఇంద్రజను సంప్రదిస్తే నేను ఇంకా ఆ చిన్న హీరోల సినిమాల్లో నటించను.
కేవలం పెద్ద సినిమాల్లోనే నటిస్తాను అంటూ కరాకండిగా తేల్చి చెప్పింది.దాంతో అప్పటి నుంచి ఇంద్రజ ను హీరోయిన్ గా ఏ సినిమా కోసం అడగలేదు.కొన్నాళ్ళకు ఇంద్రజ కెరియర్ కూడా ముగిసిపోయింది.