నిద్రలేమి ఉక్కిరి బిక్కిరి చేస్తుందా.. టెన్ష‌న్ వద్దు ఇంట్లోనే దాన్ని ఇలా వదిలించుకోండి!

ఇటీవల కాలంలో నిద్రలేమి సమస్యతో( Insomnia ) బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది.మ‌న‌లో చాలా మంది మొబైల్ ఫోన్లకు గంటలు తరబడి అతుక్కుపోతున్నారు.

 Follow These Tips To Get Rid Of Insomnia , Insomnia, Insomnia Relief Drinks,-TeluguStop.com

చివరకు నిద్ర సమయాన్ని కూడా వృధా చేస్తుంటారు.ఈ క్రమంలోనే నిద్రలేమి బారిన పడతారు.

నిద్రలేమి సమస్య వల్ల ఎంత పడుకుందామని ప్రయత్నించినా అస్సలు నిద్ర పట్టదు.కంటినిండా కునుకు లేకపోతే మనిషి మానసికంగా, శారీరకంగా అలసిపోతాడు.

పైగా గుండెపోటు, మధుమేహం, ఊబకాయం ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.

Telugu Sleep, Tips, Insomnia, Insomnia Drinks, Latest, Disorder-Telugu Health

వీటన్నిటికి దూరంగా ఉండాలంటే కచ్చితంగా నిద్రలేమిని వదిలించుకోవాలి.రోజుకు 6 నుంచి 8 గంటలపాటు పడుకోవాలి.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్స్ చాలా అద్భుతంగా సహాయపడతాయి.

నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు రోజు పడుకోవడానికి గంట ముందు ఒక గ్లాసు బాదం పాలు( Almond milk ) తీసుకుని అందులో పావు టేబుల్ స్పూన్ జాజికాయ తురుము, పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి,( cinnamon powder ) రెండు టేబుల్ స్పూన్ల తేనె కలుపుకుని సేవించాలి.ఈ డ్రింక్ నిద్రను ప్రేరేపించే హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది, నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది, రోజు నైట్ ఈ డ్రింక్ తాగితే ప్రశాంతమైన నిద్ర పడుతుంది.

Telugu Sleep, Tips, Insomnia, Insomnia Drinks, Latest, Disorder-Telugu Health

అలాగే బ్లండర్ తీసుకుని అందులో ఒక అరటిపండు ( Banana )ఒక గ్లాస్ బాదం పాలు, రెండు స్పూన్లు ఆల్మండ్ బటర్ ( Almond butter )వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా బనానా ఆల్మండ్‌ జ్యూస్ సిద్ధం అవుతుంది.ఈ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది.పైగా నిద్రలేమి సమస్యను త‌రిమికొట్టడానికి అద్భుతంగా తోడ్పడుతుంది.రోజు నైట్ పడుకోవడానికి రెండు గంటలు ముందు ఈ బనానా ఆల్మండ్ డ్రింక్‌ను తీసుకుంటే వద్దన్నా కూడా నిద్ర ముంచుకు వస్తుంది.చక్కటి నాణ్యమైన నిద్ర మీ సొంతం అవుతుంది.

ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే.నిద్రలేమితో ఉక్కిరి బిక్కిరి అవుతున్న‌వారు రోజుకు కనీసం 30 నిమిషాలైనా వ్యాయామం చేయండి.

వ్యాయామం కూడా నిద్ర‌లేమికి ఒక న్యాచుర‌ల్ మెడిసిన్‌లా ప‌ని చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube