సూర్యాపేట జిల్లా:కోదాడ నియోజకవర్గ పరిధిలోని మోతె మండలం బల్లు తండాలో ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకున్న తరుణంలో ప్రధాన పార్టీల ప్రచారం పీక్ లెవల్ కి చేరింది.
ఈ నేపథ్యంలో ఆదివారం కోదాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఉత్తమ్ పద్మావతి రెడ్డి( Uttam Padmavathi Reddy ) మోతె మండలం బల్లుతండాకు చేరుకున్నారు.దీనితో అదే గ్రామంలో ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తొస్తారని,మా గ్రామంలో మీరు తిరుగొద్దని,మీకు తండాలో ఓటు అడిగే నైతిక హక్కు లేదంటూ కాంగ్రెస్ ప్రచారాన్ని అడ్డుకున్నారు.
దీనితో కాంగ్రెస్,బీఆర్ఎస్ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.ఈలోగా పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు పార్టీల వారిని అక్కడి నుండి పంపించడంతో గొడవ సద్దమణిగింది.







