తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఏపీ, ఢిల్లీ, హర్యానా, కర్ణాటకతో పాటు హైదరాబాద్ లోనూ సోదాలు ముగిశాయి.
ఏడు బృందాలుగా విడిపోయి అధికారులు తనిఖీలు చేపట్టారు.ఆధారాల సేకరణపై దృష్టి సారించిన సిట్.
నిందితుల ఇళ్లతో పాటు వారి సంబంధిత కార్యాలయాల్లో దాడులు కొనసాగించింది.దీనిలో భాగంగా కేరళలో సిట్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.
తుషార్, రామచంద్రభారతికి ఓ వైద్యుడు మధ్యవర్తిగా వ్యవహారించినట్లు గుర్తించారు.ఆయనకు ఈ కేసుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.
అయితే సిట్ అధికారులు వస్తున్న విషయాన్ని తెలుసుకుని వైద్యుడు పరారైనట్లు సమాచారం.అదేవిధంగా ఈ కేసులో మరి కొంతమందికి నోటీసులు పంపే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.







