చిట్లిన జుట్టు లేదా స్ల్పిట్ ఎండ్స్.చాలా మందిని ఇబ్బంది పెట్టే జుట్టు సంబంధిత సమస్యల్లో ఇది ఒకటి.
జుట్టు సంరక్షణ లేక పోవడం, ఆహారపు అలవాట్లు, పోషకాల లోపం, ఒత్తిడి, మానసిక ఆందోళన, కాలుష్యం, వాతావరణంలో వచ్చే మార్పులు, కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపూలను వాడటం ఇలా రకరకాల కారణాల వల్ల జుట్టు చివర్లు చిట్లిపోతూ ఉంటుంది.ఫలితంగా హెయిర్ గ్రోత్ ఆగిపోతుంది.
అందుకే ఈ సమస్యను నివారించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే చిట్లిన జుట్టుకు చెక్ పెట్టడంలో ఆవ నూనె అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఆలస్యమెందుకు జుట్టుకు ఆవ నూనెను ఎలా వాడాలో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు కలబంద ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్‌పై మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు ఆవ నూనె, పేస్ట్ చేసుకున్న కలబంద, చిటికెడు మిరియాల పొడి వేసి పది నుంచి పది హేను నిమిషాల పాటు హీట్ చేయాలి.
ఆ తర్వాత నూనెను చల్లారనిచ్చి.
ఆపై ఫిల్టర్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ నూనెను జుట్టు చివర్లనే కాకుండా మొత్తానికి పట్టించి కాసేపు మసాజ్ చేసుకోవాలి.
గంట అనంతరం గోరు వెచ్చని నీటితో కెమికల్స్ లేని షాంపూను యూజ్ చేసి తల స్నానం చేయాలి.ఇలా వారంలో ఒకటి లేదా రెండు సార్లు చేస్తే.
చిట్లిన జుట్టు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

అంతే కాదు.ఈ నూనెను వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.చుండ్రు సమస్య ఏమైనా ఉంటే తగ్గు ముఖం పడుతుంది.
మరియు తెల్ల జట్టు సమస్య త్వరగా దరి చేరకుండా ఉంటుంది.