ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించి ఆదర్శంగా నిలిచిన పేద విద్యార్థి

సూర్యాపేట జిల్లా:ప్రభుత్వ పాఠశాల( Government School )లో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని నిరూపించాడు మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామానికి చెందిన ఇమ్మడి ఉప్పలయ్య,విజయకుమారి దంపతుల ద్వితీయ కుమారుడు ఇమ్మడి ప్రవీణ్( Immadi Praveen ).

పేద కుటుంబానికి చెందిన ప్రవీణ్ పదవ తరగతి వరకు పోలుమల్ల ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్ రాజపేట గురుకుల పాఠశాలలో చదువుకున్నాడు.

నీట్ పరీక్ష రాసి మొదటిసారి విఫలమైనా నిరాశ చెందకుండా,రెండవసారి ప్రయత్నించి ఎంబీబీఎస్ సీట్( MBBS Seat ) ను సాధించాడు.

మహబూబ్ నగర్ మెడికల్ కళాశాల( Mahabubnagar Medical College )లో గురువారం ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రుల కల నెరవేర్చాడు.

ఈ సందర్బంగా తండ్రి ఉప్పాలయ్య మాట్లడుతూ ఈ రోజు నా కుమారుడు ఈ స్థితికి రావడానికి కారణమైన బాబాసాహెబ్ అంబేద్కర్ కు,భారత రాజ్యాంగానికి,చదువు నేర్పిన గురువులకు, వెన్నుతట్టి ప్రోత్సహించిన బంధువులకు,మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రవీణ్ ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించిన విషయం తెలుసుకొని పలువురు హర్షం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్ తల్లి, తండ్రి పుట్టినరోజు ఒకేరోజా.. ఇలా జరగడం ఆశ్చర్యమే అంటూ?