సూర్యాపేట జిల్లా:బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) సూర్యాపేట జిల్లా నూతన అధ్యక్షుడిగా తనను రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ నియమించినట్లు ఆదివారం పగిడిమర్రి బాబురావు( Pagidimarri Baburao ) ఒక ప్రకటనలో తెలిపారు.బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ మంతపురి బాలయ్య ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందన్నారు.
హైదరాబాద్( Hyderabad ) పార్టీ ఆఫీస్ లో జరిగిన నల్లగొండ పార్లమెంటు స్థాయి సమావేశంలో ఈ మేరకు తనకు నియామక పత్రం అందజేసినట్లు పేర్కొన్నారు.పార్టీ ఆదేశాల మేరకు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని,తన ఎంపికకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.