ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది:రాంరెడ్డి దామోదర్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని సీతారాంపురం కి చెందిన చింతల హనుమంతరావు గత కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ లో చనిపోవడంతో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ద్వారా వచ్చిన రాజీవ్ ప్రమాద బీమా రెండు లక్షల చెక్కు ను మృతిని భార్య చింతల వెంకటరమణకి బుధవారం మాజీ మంత్రి,పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి( Ram Reddy Damodar Reddy ) అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కు పునాది కార్యకర్త అని,పార్టీ జెండాను,ఎజెండాను భుజాలపై మోస్తూ,జనం గుండెల్లో నిలిపేవాడే కార్యకర్త అని అన్నారు.

 Congress Party Stands By Every Activist: Ram Reddy Damodar Reddy Accident Insura-TeluguStop.com

అలాంటి కార్యకర్తకు కష్టం వస్తే కన్నతల్లి లాంటి పార్టీ ఆదుకోవాలన్న ఉద్ధేశంతో ప్రమాద భీమా పథకాన్ని( Accident insurance scheme) ప్రవేశ పెట్టిందని,పార్టీ కోసం ప్రాణం పెట్టే కార్యకర్త ప్రమాదవశాత్తు ప్రాణం వదిలితే తన కుటుంబానికి కొంతైనా అండగా ఉండేందుకు రూ.2 లక్షల బీమా కలిపిస్తున్నామని తెలిపారు.అభివృద్ధి, సంక్షేమంతో పాటు పార్టీ పటిష్టత కోసం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ( Congress party ) కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని, మండలంలో ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాననిచెప్పారు.కుటుంబ పెద్దదిక్కుని కోల్పోయి బాధలో వున్న కుటుంబాలకు రాజీవ్ గాంధీ ప్రమాద భీమా ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి కుందామల్ల శేఖర్,వార్డు కాంగ్రెస్ ఇంచార్జి కుందామల్ల అంజమ్మ, ప్రమీల,మణెమ్మ, పార్వతమ్మ,మరియమ్మ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube