కెనడా : అల్బెర్టా ప్రావిన్షియల్ ఎన్నికల బరిలో 15 మంది ప్రవాస భారతీయులు..!!

కెనడాలో( Canada ) పెద్ద సంఖ్యలో స్థిరపడిన భారతీయులు అభ్యర్ధుల గెలుపొటములను శాసిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఇక్కడ ఎంపీలు, కౌన్సిలర్లు, మేయర్లుగా, మంత్రులుగా ఇండో కెనడియన్లు రాణిస్తున్నారు .

 15 Indian Origin Candidates In Fray For Alberta Provincial Elections In Canada ,-TeluguStop.com

తాజాగా కెనడాలోని కీలకమైన అల్బెర్టా ప్రావిన్షియల్ ఎన్నికల బరిలో 15 మంది భారత సంతతి అభ్యర్ధులు బరిలో నిలిచారు.వీరంతా పంజాబీ మూలాలు వున్నవారు కావడం గమనార్హం.

అల్బెర్టా ప్రావిన్స్‌లోని మొత్తం 87 నియోజకవర్గాలకు మే 29న పోలింగ్ జరగనుంది.

Telugu Indianorigin, Canada, Rajan Sawhney-Telugu NRI

ఇక్కడ రెండు ప్రధాన రాజకీయ పార్టీలైన నేషనల్ డెమొక్రాటిక్ పార్టీ( National Democratic Party ) (ఎన్‌డీపీ), యునైటెడ్ కన్జర్వేటివ్ పార్టీ ఆఫ్ అల్బెర్టా (యూసీపీ)లు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి.ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి.ఈ నేపథ్యంలో అల్బెర్టాలో పెద్ద సంఖ్యలో స్థిరపడిన దక్షిణాసియన్లు, పంజాబీలను ఆకట్టుకోవాలని భావిస్తున్నాయి.

కాల్గరీ, ఎడ్మంటన్ ఏరియాల్లో పంజాబీ అభ్యర్ధులను బరిలోకి దింపాయి.ఎన్నికల్లో పోటీ చేస్తున్న పంజాబీ సంతతి వారిలో రాజన్ సాహ్నీ( Rajan Sawhney ) (వాణిజ్యం, ఇమ్మిగ్రేషన్, సాంస్కృతిక శాఖ మంత్రి) కాల్గరీ నార్త్ వెస్ట్ నుంచి యూసీపీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు.

ఎంఎల్ఏ దేవిందర్ టూర్ కాల్గరీ – ఫాల్కన్‌రిడ్జ్ నుంచి యూసీపీ నుంచి బరిలోకి దిగారు.మరో ఎమ్మెల్యే జస్వీర్ డియోల్ ఎన్‌డీపీ టికెట్‌పై ఎడ్మంటన్ మెడోస్ నుంచి పోటీ చేస్తున్నారు.

Telugu Indianorigin, Canada, Rajan Sawhney-Telugu NRI

2019 ఎన్నికల్లో సాహ్నీ.కాల్గరీ నార్త్ ఈస్ట్ రైడింగ్ నుంచి గెలుపొందారు.ఈ ఏడాది ప్రారంభంలో ఆమె తాను ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేయడం లేదని ప్రకటించారు.యూసీపీకే చెందిన మరో కీలక నేత మంత్రి, కాల్గరీ నార్త్ వెస్ట్ సిట్టింగ్ సోనియా సావేజ్ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించడంతో రాజన్ సాహ్నీని యూసీపీ అభ్యర్ధిగా ప్రకటించింది.

ఎంబీఏతో పాటు కాల్గరీ యూనివర్సిటీ నుంచి ఆర్ధిక శాస్త్రం, పొలిటికల్ సైన్స్‌లో రాజన్ డిగ్రీలు పొందారు.రాజకీయాల్లో చేరడానికి ముందు ఆమె 20 ఏళ్ల పాటు చమురు, గ్యాస్ పరిశ్రమలో పనిచేశారు.

Telugu Indianorigin, Canada, Rajan Sawhney-Telugu NRI

ఇక మిగిలిన అభ్యర్ధుల విషయానికి వస్తే కాల్గరీ భుల్లార్ మెకాల్ నుంచి అమన్‌ప్రీత్ సింగ్ గిల్, కాల్గరీ నార్త్ ఈస్ట్ నుంచి ఇందర్ గ్రేవాల్, ఎడ్మంటన్ ఎల్లర్సీ నుంచి ఆర్ సింగ్ బాత్, ఎడ్మంటన్ మెడోస్ నుంచి అమృతపాల్ సింగ్ మాథారు, ఎడ్మంటన్ మిల్ వుడ్స్ నుంచి రామన్ అథ్వాల్‌లను యూసీపీ రంగంలోకి దించింది.అలాగే ఎన్డీపీ విషయానికి వస్తే.కాల్గరీ క్రాస్ నుంచి గురీందర్ సింగ్ గిల్, కాల్గరి ఫాల్కన్‌రిడ్జ్ నుంచి పర్మీత్ సింగ్ భొపరాయ్, కాల్గరీ నార్త్ ఈస్ట్ నుంచి గురీందర్ బ్రార్, డ్రేటన్ వ్యాలీ డెవాన్ నుంచి హ్యారీ సింగ్‌లను బరిలో దించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube