ధాన్యం కొనుగోలుకు ఇబ్బంది లేకుండా చూడాలి : న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలుకు ఇబ్బంది లేకుండా చూడాలనీ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి పౌర సరఫరాల అధికారులకు సూచించారు.బుధవారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు.

 Buying Grains Should Be Hassle Free Nyalakonda Aruna Raghava Reddy,buying Grains-TeluguStop.com

విద్య, వైద్యం, ప్రణాళిక, ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, నిర్మాణ పనుల స్టాండింగ్ కమిటీలకు జడ్పీ చైర్ పర్సన్ అధ్యక్షత వహించగా, వ్యవసాయం పై వైస్ చైర్మన్ సిద్ధం వేణు, మహిళా సంక్షేమ పై తంగలపల్లి జడ్పీటిసి పూర్మాని మంజుల, సాంఘిక సంక్షేమం పైబోయినపల్లి జడ్పీటీసీ కత్తెర పాక ఉమ కొండయ్య స్టాండింగ్ కమిటీలకు అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి మాట్లాడుతూ…జిల్లాలో రబీ సీజన్ ధాన్యం కొనుగోలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

గన్నీ బ్యాగులు, హమాలీల కొరత, ట్రాన్స్‌పోర్ట్‌ సమస్య లేకుండా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు.రైస్ మిల్లుల వద్ద ధాన్యం అన్ లోడింగ్ త్వరితగతిన జరిగేలా చూడాలన్నారు.

ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే సాధ్యమైనంత త్వరగా రైతులకు డబ్బులు వారి ఖాతాలో జమ అయ్యేలా చూడాలన్నారు.దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందని తెలిపారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలులో ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

వాటి గురించి క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యవంతం చేయడమే కాకుండా ప్రతి గడపకు ప్రభుత్వ పథక ఫలాలు అందేలా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కృషి చేయాలన్నారు.

శాఖ పరంగా జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిర్దేశిత సమయంలో పనులు పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.జిల్లాలో పాడి అభివృద్ధికి విశేష అవకాశాలు ఉన్న దృష్ట్యా పాడి గేదెల యూనిట్లను అర్హులకు మంజూరు చేయాలన్నారు.

యూనిట్లను అందజేసే ముందు వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తే అధిక లాభాలు సొంతం చేసుకునే అవకాశం ఉందన్నారు.మిషన్ భగీరథ అధికారులు ప్రతివారం తమ మండలంలోని అన్ని గ్రామాలు తిరిగేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని అన్నారు.

తద్వారా అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు.జిల్లాలో మినీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రభుత్వం 35 శాతం రాయితీ ఇస్తుందన్నారు.వ్యక్తులు గానీ, సమూహాలు గా గానీ, పాక్స్ ద్వారా గాని యూనిట్ లను స్థాపన చేయవచ్చునని అన్నారు.వ్యవసాయ సాంప్రదాయ పద్ధతుల నుంచి బయటపడుతూ పంట మార్పిడిపై దృష్టి సారించి వ్యవసాయ అనుబంధ రంగాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనపై దృష్టి సారించాలన్నారు.

మినీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున రాయితీలు అందిస్తున్నందున ఆ అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు.అప్పటి ప్రభుత్వాల హయాంలో లక్ష రూపాయల రుణం ఇవ్వాలంటే లబ్ధిదారులు ఎంతో కష్టపడాల్సి వచ్చేదన్నారు.

మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు యూనిట్ల స్థాపనకు ఆర్థిక సహకారం అందజేస్తుందన్నారు.దళిత బంధు పథకం ద్వారా దళితుల జీవితాల్లో అభివృద్ధి వెలుగులు నింపేలా భారీ ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు.

మన ఊరు మన బడి ప్రోగ్రాం పనులు వేగవంతంగా జరగాలని దీనికి సంబందించిన శాఖలు సమన్వయం చేసుకోవాలన్నారు.ఈ సమావేశంలో వైస్ చైర్మన్ సిద్దం వేణు , జడ్పీటిసి లు కత్తెరపాక ఉమ కొండయ్య , గట్ల మీనయ్య , మ్యాకల రవి , గుగులోత్ కళావతి సురేష్ నాయక్ , ఏస వాణి , కోఆప్షన్ సభ్యులు చాంద్ పాషా గారు, అహ్మద్ , జడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి , అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube