ప్రతి నెల పలకరించే పీరియడ్స్( Periods ) వల్ల మహిళలు ఎంతగానో సఫర్ అవుతూ ఉంటారు.ఆ టైమ్ లో పొత్తికడుపు నొప్పి, కాళ్లు లాగేయడం, చిరాకు, ఒత్తిడి, మూడ్ స్వింగ్స్ వంటివి మహిళలకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి.
అయితే ఒక్కోసారి మహిళలు తమ పీరియడ్స్ ను పోస్ట్ పోన్ లేదా ప్రీపోన్ చేయాలనుకుంటారు.పెళ్లిళ్లు, ఫంక్షన్స్ లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యం, పూజా వంటివి ఉన్నప్పుడు మహిళలు పీరియడ్స్ ను పోస్ట్ ఫోన్ చేయాలని అనుకుంటారు.
ఇంకొందరు ప్రీపోన్ చేయాలని భావిస్తుంటారు.ఈ క్రమంలోనే మందులు వాడతారు.

అయితే ఆ మందులు వాడటం వల్ల కొన్ని కొన్ని సార్లు ఆరోగ్యం దెబ్బతింటుంది.హార్మోన్లలో హెచ్చు తగ్గులు ఏర్పడతాయి.అందుకే సహజ పద్ధతిలో పీరియడ్స్ ను పోస్ట్ పోన్ లేదా ప్రీపోన్ చేసుకోవడానికి ప్రయత్నించాలి.ముఖ్యంగా మీరు మీ పీరియడ్స్ ను ప్రీపోన్ చేయాలని భావిస్తుంటే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ మీకు గ్రేట్ గా సహాయపడుతుంది.
నెలసరి తేదీకి పది రోజుల ముందు నుంచి ఈ డ్రింక్ ను తీసుకుంటే కనుక మీ పీరియడ్స్ ముందుగానే వస్తాయి.

డ్రింక్ తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము వేసుకోవాలి.అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టేబుల్ స్పూన్ వాము పొడి, పావు టేబుల్ స్పూన్ సోంపు పొడి( Fennel Seed Powder ) వేసుకొని ఐదు నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత అందులో పావు టేబుల్ స్పూన్ పసుపు( Turmeric ) వేసి మరో ఐదు నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఇప్పుడు స్టైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.
పీరియడ్స్ త్వరగా రావడానికి ఈ డ్రింక్ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.నెలసరి తేదికి పది రోజుల ముందు నుంచి రెగ్యులర్ గా ఈ డ్రింక్ ను తీసుకుంటే.
మూడు నాలుగు రోజులు ముందుగానే పీరియడ్స్ వస్తాయి.అలాగే కొందరికి నెలసరి అనేది సక్రమంగా రాదు.
దీన్నే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని అంటారు.చాలామంది మహిళలు ఈ సమస్యతో బాధపడుతుంటారు.
అయితే అలాంటి వారికి కూడా ఇప్పుడు చెప్పుకున్న డ్రింక్ సహాయపడుతుంది.వారానికి రెండు మూడు సార్లు ఈ డ్రింక్ ను తీసుకుంటే కనుక పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి.