పిఏసిఎస్ సెంటర్లో తరుగు పేరుతో మోసపోతున్న రైతన్నలు...!

సూర్యాపేట జిల్లా: చివ్వెంల మండల కేంద్రంలోని పిఎసిఎస్ సెంటర్లో రైతులను తరుగు పేరుతో మోసం చేస్తున్నారని గురువారం పిఏసిఎస్ చైర్మన్ మారునేని సుధీర్ రావు @లక్ష్మణరావుతో అన్నదాతలు వాగ్వాదానికి దిగారు.రైతులు తమ ధాన్యం కొనుగోలు విషయంలో జరిగిన అక్రమ దందా గురించి అడుగుతున్న క్రమంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నిన్ను ధాన్యము ఇక్కడ ఎవడు పోయమన్నాడంటూ అధికార మదంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని

 Farmers Are Being Cheated In Pacs Centers,farmers , Pacs Centers, Maruneni Sudhe-TeluguStop.com

రైతు బిడ్డ ఆవేదన వెన్న మధుకర్ రెడ్డి ఆరోపించారు.

ధాన్యం కొనుగోలులో జరిగిన అవకతవకల మీద విచారణ చేయకుండా పిఏసిఎస్ సిబ్బందిని వెనకేసుకొస్తూ రైతులకు ఆన్యాయం చేస్తున్నారని వాపోయారు.సస్పెండ్ చేసిన ఉద్యోగిని సెంటర్లలో తిప్పుతూ రైతుల ధాన్యంలో అక్రమాలకు పాల్పడుతూ అధికార పార్టీ అండదండలతో అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు.

దీనిపై సమగ్ర విచారణ జరిపి,దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని,ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని,రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube