జై సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నవదీప్( Navdeep ) అంటే ప్రత్యేక పరచయాలు అవసరం లేని పేరు.ఈయన ఫ్యామిలీ ఆర్థికంగా బాగా ఉన్న ఫ్యామిలీ.
కాబట్టి నవదీప్ ని తమ ఫ్యామిలీ నార్త్ అలాగే సౌత్ సినిమాల్లో కూడా స్టార్ హీరోగా చేయాలని భావించారు.కానీ ఈయన నార్త్ హీరోలా ఉంటారని ముందుగా నార్త్ లో అవకాశాల కోసం ట్రై చేశారు.
అలా తేజ( Teja ) డైరెక్షన్లో జై సినిమాలో అవకాశం వచ్చింది.అయితే ఈ సినిమా యావరేజ్ గా ఆడినప్పటికీ ఆ తర్వాత వచ్చిన మొదటి సినిమా, మనసు మాట వినదు, గౌతమ్ ఎస్ఎస్ఎస్సి, సీతాకోకచిలుక, చందమామ వంటి సినిమాలతో ఈ హీరోకి మంచి పేరు తీసుకొచ్చి పెట్టాయి.

అయితే ఈయన కేవలం తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లో( Tamil movies ) కూడా వరుస పెట్టి నటించడంతో అక్కడ కూడా స్టార్ హీరో స్థాయికి చేరారు.అయితే నవదీప్ సినీ కేరీర్ అలా హిట్లు ప్లాఫులతో కొనసాగుతున్న టైంలో ఓ హీరోయిన్ ని నవదీప్ లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ వార్తలు వినిపించాయి.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు అంకిత( Ankita ).

నవదీప్, అంకిత కలిసి మనసు మాట వినదు( manasu mata vinadhu ) అనే సినిమాలో నటించారు.అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో నవదీప్ అంకితను లైంగికంగా వేధించాడని, ఆయన టార్చర్ భరించలేక అంకిత ఆయన పేరు లెటర్ లో రాసి పెట్టీ సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది అంటూ వార్తలు వినిపించాయి.అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు అని ఈ మధ్యకాలంలో నవదీప్ క్లారిటీ ఇచ్చారు.
అంతేకాదు అప్పట్లో అంకిత నవదీప్ పై ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ ఇవ్వడంతో ఫిల్మ్ ఛాంబర్ మెంబర్స్ కూర్చొని మాట్లాడుకొని ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేశారు.








