క్రిమిసహారక మందు తాగి కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం

సూర్యాపేట జిల్లా(Suryapet District ):కోదాడ పట్టణంలోని గణేష్ నగర్( Ganesh Nagar ) లో నివాసం ఉంటున్న హుజూర్ నగర్ మండలంవేపలసింగారం గ్రామానికి చెందిన రామిరెడ్డి కుటుంబ సభ్యులు ముగ్గురు మంగళవారం క్రిమిసంహారక మందు సేవించి ఒకేసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పట్టణంలో కలకలం రేపింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…

 The Entire Family Attempted Suicide By Drinking Insecticide-TeluguStop.com

మద్యానికి బానిసైన రామిరెడ్డి నిత్యం తాగొచ్చి భార్యను వేధిస్తుండడంతో కుటుంబంలో ఘర్షణ జరిగేది.

భార్యతో పాటు కూతురు కూడా అతనిని మందలించే వారు.ఈ క్రమంలో మంగళవారం కూడా మద్యం సేవించి వచ్చిన రామిరెడ్డి ఇంట్లో గొడవకు దిగడంతో విసుగు చెందిన భార్య ముందు పురుగుల మందు తాగింది,అది చూసిన చార్టెడ్ అకౌంట్ విద్యను అభ్యసిస్తున్న బిడ్డ స్నేహ(Sneha ) కూడా తాగింది.

తర్వాత తాగిన మైకంలో ఉన్న రామిరెడ్డి కూడా పురుగుల మందు సేవించాడు.దీనితో ముగ్గురు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో గమనించిన చుట్టు పక్కల వారు హాస్పిటల్ తరలించగా,ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం(Khammam ) తరలించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube