నేరేడుచర్లలో వెలుగు చూసిన సరికొత్త సైబర్ క్రైం...!

సూర్యాపేట జిల్లా: హలో… నేను ఏఎస్ఐను మాట్లాడుతున్నా,మా ఎస్ఐ కూతురుకు యాక్సిడెంట్ అయింది.నేను రూ.75 వేలు క్యాష్ పంపిస్తున్నా వెంటనే ఫోన్ పే ద్వారా నాకు తిరిగి ఆ మొత్తాన్ని పంపండి అంటూ ఫేక్ కాల్ చేసి పలువురు వ్యక్తులను మోసగించి రూ.75 వేలు కొట్టేసిన సరికొత్త సైబర్ క్రైమ్ సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది.బాధితులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.శుక్రవారం రాత్రి నేరేడుచర్లలోని ఓ బంక్ యజమానికి ఓ ఆగంతకుడు కాల్ చేసి నేను ఏఎస్ఐని మాట్లాడుతున్నా,మా ఎస్ఐ కూతురికి యాక్సిడెంట్ అయింది.

 A New Cyber Crime That Has Come To Light In Nereducharla, Cyber Crime , Nereduc-TeluguStop.com

నా దగ్గర నగదు మాత్రమే ఉంది.రూ 75 వేలు పంపుతున్నాను నా అకౌంట్ లోకి ఫోన్ పే ద్వారా పంపండని చెప్పాడు.

దీంతో ఆ బంక్ యజమాని నా వద్ద ఫోన్ పే లేదని సమాధానం చెప్పడంతో మీకు తెలిసిన వారి నుండి పంపించండని ఆదేశించాడు.దీంతో సదరు బంకుయజమాని పట్టణానికి చెందిన మిత్రుడి నెంబరు ఇచ్చాడు.

ఆగంతకుడు మిత్రుడి నెంబర్ కి ఫోన్ చేయగా ఆ మిత్రుడి వద్ద సరిపోను మొత్తం లేకపోవడంతో మరో వ్యక్తిని పిలిపించుకొని ఇరువురు కలసి ఫోన్ పే ద్వారా ఆగంతకుడు చెప్పిన మరో పెట్రోల్ బంక్ సిబ్బంది అకౌంట్ కు అమౌంట్ పంపించారు.

తిరిగి ఆగంతకుడు పెట్రోల్ బంక్ సిబ్బందికి ఫోన్ చేసి నీ ఖాతాకు ఫోన్ పే ద్వారా డబ్బు చేరిందని నేను పంపిన క్యూఆర్ కోడ్ కు డబ్బు పంపమని చెప్పగా అతను పంపించాడు.

ఏఎస్ఐ పంపిస్తానన్న డబ్బు ఎంత సేపటికి రాకపోవడంతో తిరిగి తమకు వచ్చిన సెల్ నెంబర్ కు కాల్ చేయగా అది పనిచేయకపోవడంతో తాము మోసపోయామని గ్రహించి 1930 సైబర్ క్రైమ్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.అనంతరం నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ కూడా ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube