దళిత బంధు కమీషన్ పైసలు తిరుగియ్యండి...!

సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నూతనకల్ మండలంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలకు కొత్త చిక్కొచ్చి పడింది.నాలుగు నెలల క్రితం దళిత బంధు మీకే వచ్చిందని బాండ్ పేపర్ రాసిచ్చి లబ్ధిదారుల నుండి 30% కమీషన్ పై డబ్బులు తీసుకున్నారు.

 Tungathurti Constituency People Wants Dalit Bandhu Commission Money Back, Tungat-TeluguStop.com

ఈ లోపు ఎన్నికల నోటిఫికేషన్ రావడం,తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మందుల సామ్యేల్ ను ప్రకటించడంతో కాంగ్రెస్ లోకి భారీగా వలసలు పెరిగాయి.దీనితో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్ధి గాదరి కిషోర్ ఓటమి తప్పదని, అదే జరిగితే తమకు దళిత బంధు రాదని గ్రహించిన లబ్ధిదారులు తమ డబ్బులు తమకు తిరిగివ్వాలని అధికార పార్టీ నాయకులపై వత్తిడి పెంచారని తెలుస్తోంది.

డబ్బులు తీసుకున్నట్లు బాండ్ పేపర్ ఆధారాలు ఉండడంతో చేసేదేమీలేక కొందరు తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తుండగా మరికొందరు లబ్ధిదారులను ఏం చేసుకుంటారో చేసుకోండని బెదిరిస్తున్నారని సమాచారం.అయితే డబ్బులు ఇవ్వకపోతే తమ దగ్గరున్న బాండ్ పేపర్ ఆధారంతో కేసులు పెట్టేందుకు లబ్దిదారులు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube