దళిత బంధు కమీషన్ పైసలు తిరుగియ్యండి…!
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నూతనకల్ మండలంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలకు కొత్త చిక్కొచ్చి పడింది.
నాలుగు నెలల క్రితం దళిత బంధు మీకే వచ్చిందని బాండ్ పేపర్ రాసిచ్చి లబ్ధిదారుల నుండి 30% కమీషన్ పై డబ్బులు తీసుకున్నారు.
ఈ లోపు ఎన్నికల నోటిఫికేషన్ రావడం,తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మందుల సామ్యేల్ ను ప్రకటించడంతో కాంగ్రెస్ లోకి భారీగా వలసలు పెరిగాయి.
దీనితో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్ధి గాదరి కిషోర్ ఓటమి తప్పదని, అదే జరిగితే తమకు దళిత బంధు రాదని గ్రహించిన లబ్ధిదారులు తమ డబ్బులు తమకు తిరిగివ్వాలని అధికార పార్టీ నాయకులపై వత్తిడి పెంచారని తెలుస్తోంది.
డబ్బులు తీసుకున్నట్లు బాండ్ పేపర్ ఆధారాలు ఉండడంతో చేసేదేమీలేక కొందరు తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తుండగా మరికొందరు లబ్ధిదారులను ఏం చేసుకుంటారో చేసుకోండని బెదిరిస్తున్నారని సమాచారం.
అయితే డబ్బులు ఇవ్వకపోతే తమ దగ్గరున్న బాండ్ పేపర్ ఆధారంతో కేసులు పెట్టేందుకు లబ్దిదారులు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
1 నేనొక్కడినే సినిమా కోసం పెద్ద సాహసం చేసిన మహేష్… అయినా ఫలితం లేదుగా!