భువనగిరి:జిల్లా కేంద్రంలోని అర్బన్ కాలనీ రైల్వే గేట్ సమీపంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని,ఇక్కడ ప్రత్యామ్నాయంగా అండర్ బ్రిడ్జ్ పాసింగ్ ద్వారా రోడ్డు నిర్మించి కాలనీ వాసుల బాధలు తీర్చాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఒక్కరోజు దీక్షా కార్యక్రమం నిర్వహించారు.ఈ దీక్షకు కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వారి కష్టాలను జిల్లా అధ్యక్షులు అతహర్ కి విన్నవించుకున్నారు.
వారి బాధలు విన్న అతహర్ రైల్వే గేట్ బాధలు తీరేంత వరకు పోరాటం చేస్తానని,రాబోయే రోజులలో ఆమరణ నిరాహర దీక్షకు దిగి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కాలనీ వాసులతో చెప్పారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టీపీ నాయకులు,కార్యకర్తలు,కాలనీ వాసులు పాల్గొన్నారు.